చైనాలో పర్యటించి భారత్‌కు చేరుకున్న వందలమందిలో జ్వరం, దగ్గు వంటి వాటితో బాధపడుతున్న11 మందిని వైద్యుల పరిశీలనలో ఉంచారు. వీరికి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయా అనే దిశగా వైద్యులు పరీక్షలు జరిపారని సమాచారం. ఇందులో ఏడుగురు కేరళ, ఇద్దరు ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ముంబయికి చెందిన ఇద్దరు, హైదరాబాద్, బెంగళూరుకు చెందిన వారిలో వ్యాధి లక్షణాలు కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అయితే కేరళకు చెందిన ఏడుగురిని ఆయా జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో పరిశీలనలో ఉంచినట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన మరో 73మందినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇప్పటికే చైనా, హాంకాంగ్‌ల్లో ఉన్న 20 వేలమంది భారత్‌కు తిరిగి చేరుకున్నారని తెలుస్తోంది. దేశ రాజధాని దిల్లీలో ఇప్పటికే కరోనా వార్డును ఏర్పాటు చేసినప్పటికీ ఎవరినీ పరిశీలించలేదు.
అమెరికాలో కరోనా రెండో కేసు
అమెరికా చికాగో రాష్ట్రంలోని ఓ అరవై ఏళ్ల వృద్ధురాలికి కరోనా వైరస్ సోకినట్లు అగ్రరాజ్య అధికార వర్గాలు వెల్లడించాయి. మరో 50మందిని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
నేపాల్‌లో తొలి కేసు...
కరోనా వైరస్‌కు సంబంధించి మన పొరుగు దేశం నేపాల్లోనూ తొలి కేసు నమోదైంది. జనవరి 5న వుహాన్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ఓ పీహెచ్డీ విద్యార్థి.. కరోనా వ్యాధి లక్షణాలతో ఈ నెల 13న ఆస్పత్రిలో చేరాడు. అనంతరం.. కోలుకున్న అతడిని డిశ్చార్జి చేశారు.
చైనాలో ప్రబలిని ఈ మహమ్మారి ఇప్పటివరకు 26 మందిని పొట్టనపెట్టుకుంది. మరో 880 మందికిపైగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఇదీ చూడండి: మెరుపు వేగంతో కరోనా పంజా.. వుహాన్ రాకపోకలపై ఆంక్షలు