ETV Bharat / bharat

డిసెంబరు కల్లా కొవిడ్​-19 వ్యాక్సిన్‌! - corona latest news

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్​ కోసం ముమ్మర ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్​-19 టీకా వచ్చే అవకాశం ఉన్నట్లు సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా అంచనా వేసింది. టీకా అభివృద్ధిలో ఏడు దేశీయ సంస్థలు ముందంజలో ఉన్నట్లు తెలిపింది.

corona vaccine ready for use by December
'డిసెంబరు కల్లా కొవిడ్​-19 వ్యాక్సిన్‌'
author img

By

Published : Jul 20, 2020, 5:45 AM IST

ఈ ఏడాది చివరికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేస్తోంది. 'ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుపుకుంటున్న ఆస్ట్రాజెనెకా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌పై పనిచేస్తున్నాం. వచ్చే నెలలో భారత్‌లో సైతం మనుషులపై ప్రయోగాలు ప్రారంభిస్తాం. ప్రస్తుత పరిస్థితులు, ప్రయోగాత్మక పరీక్షల ఫలితాలను చూస్తే.. ఏడాది చివరికి ఆస్ట్రాజెనెకా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది' అని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అడార్‌ పూనావాలా పేర్కొన్నారు.

అమెరికాకు చెందిన బయోటెక్‌ సంస్థ కొడాజెనిక్స్‌తో కలిసి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రాజెనెకా, కొడాజెనిక్స్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, ఆస్ట్రియాకు చెందిన ధెమిస్‌, మరో రెండు సంస్థలు ఇందులో ఉన్నాయని పూనావాలా అన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను 100 కోట్ల డోసుల ఉత్పత్తి, సరఫరా నిమిత్తం ఆస్ట్రాజెనెకాతో తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌లు భారత్‌తో పాటు తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో లభిస్తాయని స్పష్టం చేశారు.

నెలల వ్యవధిలోనే

ప్రస్తుతం ఏడు భారత ఔషధ సంస్థలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధికి రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి.వాస్తవానికి వ్యాక్సిన్‌ పరీక్షలు, ఉత్పత్తి చేయడానికి కొన్నేళ్ల సమయం పడుతుంది. కానీ నెలల వ్యవధిలోనే తీసుకురావడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

భారత్‌ బయోటెక్‌ ముందంజ

కరోనా వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ బయోటెక్‌ ముందంజలో ఉంది. ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఇప్పటికే అనుమతులు లభించగా, చేపట్టారు కూడా. కంపెనీ హైదరాబాద్‌ కేంద్రంలో కొవాగ్జిన్‌ అభివృద్ధి, తయారీలను చేపట్టారు. ఏడునెలల్లోగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ జైకోవ్‌-డీ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేయాలని జైడస్‌ క్యాడిలా సన్నాహాలు చేస్తోంది. కంపెనీ కూడా గతవారమే మనుషులపై ప్రయోగాలను మొదలుపెట్టింది. ట్రయల్స్‌ విజయవంతమైతే వ్యాక్సిన్‌ రావడానికి ఏడు నెలల సమయం పడుతుందని కంపెనీ ఛైర్మన్‌ పంకజ్‌ పటేల్‌ తెలిపారు. ఐర్లాండ్‌కు చెందిన రెఫానాతో కలిసి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు పనేసియా బయోటెక్‌ జూన్‌లో ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్‌ యూనివర్సిటీతో ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. మిన్‌వాక్స్‌, బయోలాజికల్‌-ఇ వంటి సంస్థలు సైతం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి.

ఇదీ చూడండి: 24గంటల వ్యవధిలో 23,672మంది డిశ్చార్జ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.