ETV Bharat / bharat

'కరోనా' లాక్​డౌన్​ కఠినం.. ఉల్లం'ఘనుల'పై కేసులు - Case of coronavirus in india

కరోనా మహమ్మారి నియంత్రణే ధ్యేయంగా పలు రాష్ట్రాలు లాక్​డౌన్​ను అమలు చేస్తున్నాయి. ప్రజలు ఆంక్షలు ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు పోలీసులు కర్ఫ్యూను కూడా విధించారు. నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేశారు. మరికొన్ని చోట్ల లాఠీలు ఝళిపించి, గుంజీలు తీయించి మరీ పరిస్థితులను వివరించారు.

COROANA AFFECT  INDIAN STATES LOCKDOWN
కరోనా ఎఫెక్ట్ ... భారత్ లాక్​డౌన్​
author img

By

Published : Mar 24, 2020, 9:46 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే కఠిన చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. అయినా ప్రజలు యథేచ్ఛగా బయట తిరుగుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూను అమల్లోకి తెచ్చాయి. దేశవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వందలాది కేసులు నమోదయ్యాయి. మరికొన్ని చోట్ల ఆంక్షలను లెక్క చేయని వారిపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. గుంజీలు తీయించి మరీ పరిస్థితిని వివరించారు.

మహారాష్ట్ర

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించిన 114 మంది ఆకతాయిలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అక్రమంగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలను, ఆంక్షలు ఉన్నా తెరిచిన 16 హోటళ్లు, 53 దుకాణాలను సీజ్‌ చేశారు.

గుజరాత్​

గుజరాత్​లో లాక్​డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన 426 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో 90 శాతం వరకు లాక్​డౌన్ విజయవంతమైందని తెలిపారు.

ఒడిశా

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఒడిశా (30 జిల్లాల్లో) మొత్తం లాక్​డౌన్ విధిస్తున్నట్లు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది మార్చి 29 వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని 14 జిల్లాలు లాక్​డౌన్​లో ఉన్నాయి.

దిల్లీ

దిల్లీలోని చాలా ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. ఆంక్షల ఉల్లంఘనలపై 100కు పైగా కేసులను నమోదు చేసిన పోలీసులు... 77 మందిని అరెస్టు చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 674 మందిని అదుపులోకి తీసుకున్నామని.. 66 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. మార్చి 31 వరకు సెక్షన్ 144 అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

అత్యవసర సేవలు మినహా అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు వెనక్కి తిప్పి పంపారు. పాల విక్రయ కేంద్రాలు, కూరగాయల మార్కెట్లు రద్దీతో కిటకిటలాడాయి. మార్కెట్లకు తరలివచ్చిన ప్రజలు కనీస భద్రతా చర్యలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

కేరళ

కేరళలో ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తూ పోలీసులు మార్చ్‌ నిర్వహించారు.

ఉత్తర్​ప్రదేశ్​

ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. మొత్తం 75 జిల్లాల్లో లాక్‌డౌన్ విధించామని, ఇది 3 రోజులు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

హరియాణా

హరియాణాలో ఒకే చోట ఎక్కువ మంది గుమిగూడిన వారిని పోలీసులు చెదరగొట్టారు. ఆంక్షలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిపై లాఠీ ఝుళిపించారు.

మధ్యప్రదేశ్​

మధ్యప్రదేశ్‌లో కర్ఫ్యూ విధించి... నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఆంక్షలను విస్మరించి బయటకు వచ్చిన పౌరులకు 'మేము సమాజ ద్రోహులం' అని రాసి ఉన్న కాగితాలను చేతికిచ్చి నిలబెట్టారు.

పంజాబ్​

పంజాబ్‌లో రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 232 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసిన పోలీసులు 111 మందిని అదుపులోకి తీసుకున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే.... మినహాయింపు ఇస్తున్నారు. ఆంక్షలను విస్మరించి బయటకు వచ్చిన వారిపై పోలీసులు లాఠీ ఝుళిపిస్తున్నారు.

పశ్చిమ్​ బంగ

కరోనా నివారణ కోసం రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఇది మార్చి 31 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాణిజ్య, వ్యాపార కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలతో పాటు అన్నిరకాల కంపెనీలను మూసివేయాలని ఆదేశించారు. ఆంక్షలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 255మందిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు.

బిహార్​

బిహార్‌లో పోలీసులు ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఆంక్షలను విస్మరించి రోడ్లపైకి వచ్చిన ప్రజలతో గుంజీలు తీయించారు. చాలా గ్రామాల ప్రజలు, తమ ఊరిలోకి రావద్దంటూ పొలిమేరల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. తమ గ్రామంలో వచ్చే వారిని, ఆపి వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.

హిమాచల్​ప్రదేశ్​

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు హిమాచల్​ప్రదేశ్‌లో నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి జైరామ్ ఠాకుర్ తెలిపారు. రాష్ట్రంలో ఆంక్షలు విధించినా, ప్రజలు ఉల్లంఘనలకు పాల్పడడం వల్ల కర్ఫ్యూ విధించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయిందని ఆయన వివరించారు.

ఇదీ చూడండి: 'సానూకుల ధోరణితో వైరస్​ను పారదోలుదాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.