ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఉదయం 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో.. జగర్గుండా అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వు పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో నక్సలైట్లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: 'కనిష్ఠ స్థాయికి జీడీపీ- 'మోదీ ఉంటే సాధ్యమే''