ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూలోని బహుజన్ సమాజ్ ప్రేరణ కేంద్రంలో పార్టీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మాయావతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నెల రోజుల క్రితం మొదలైన ఈ వ్యవహారం ఇప్పటికీ సాగుతూనే ఉంది.
2005లో తన హయాంలో ఈ ప్రేరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు నాటి ముఖ్యమంత్రి మాయావతి. విగ్రహాల వ్యవహారంపై అనేక రాజకీయాలు నడిచాయి. మాయావతిపై ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ మాయావతి మాత్రం.. ఇలాంటి విగ్రహాలతో దళితులు గర్వపడతారని అనేకమార్లు స్పష్టం చేశారు.