గుజరాత్ భరూచ్ జిల్లా దహేజ్లోని రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలి 40 మందికి గాయాలయ్యాయి.
"మధ్యాహ్నం సమయంలో వ్యవసాయ రసాయన కంపెనీకి చెందిన బాయిలర్ పేలి 35 నుంచి 40 మంది కార్మికులకు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు." అని భరూచ్ జిల్లా పాలనాధికారి ఎండీ మోదీయా తెలిపారు.
కర్మాగారం పరిసర ప్రాంతాల్లో ఉన్న లఖి, లువారా గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు మోదీయా. పరిశ్రమలో పెద్ద మొత్తంలో రసాయనాలు ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:జీర్ణక్రియ సమస్య 'షికంజి'తో మాయం