మెట్రో నగరం చెన్నైలో కొవిడ్-19 వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ కారణంగా ఎవరూ ఆకలితో ఉండకూడదని ఉచిత భోజన పంపిణీ చేస్తుంది అక్కడి ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జూన్ 19 నుంచి 30 వరకు చెన్నైలోని కేకే నగర్లో అమ్మ క్యాంటీన్లు అన్నార్తుల ఆకలి తీరుస్తాయి. పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
తమిళనాడులో ఇప్పటివరకు 56,845, కేసులు నమోదయ్యాయి. 700లకు పైగా వైరస్‌తో మృతి చెందారు.
ఇదీ చూడండి: 'కరోనా ఒత్తిడిని జయించేందుకు యోగా గొప్ప సాధనం'