రామమందిర భూమిపూజకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ముఖ్యనేతలు హాజరుకానున్న నేపథ్యంలో.. అయోధ్యను సందర్శించారు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ క్రమంలో రామ జన్మభూమి ఆలయంలోని లక్ష్మణ, భరత, శత్రుజ్ఞుల విగ్రహాలను కొత్తగా ఏర్పాటుచేసిన పీఠాలపై ప్రతిష్ఠించారు.
శనివారం మధ్యాహ్నం అయోధ్యకు చేరుకున్న యోగి ఆదిత్యనాథ్... తొలుత హనుమాన్ పూజలో పాల్గొన్నారు. అనంతరం రామమందిర నిర్మాణ భూమిపూజ కోసం చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం.. కరసేవక్పురాన్ని సందర్శించనున్నారు యోగి.
కరోనా నేపథ్యంలో ఈ వేడుకలకు 200 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'రాజ'కీయం.. మరికాసేపట్లో గవర్నర్తో భాజపా నేతల భేటీ