ETV Bharat / bharat

కుక్కర్​లో తల ఇరుక్కుపోయి.. తల్లడిల్లిన చిన్నారి - cooker stuck in the head of a one year old girl

కుక్కర్​లో తల ఇరుక్కుపోయి ఏడాది వయసున్న చిన్నారి తల్లడిల్లిపోయింది. కుటుంబ సభ్యులు, వైద్యులు కొన్ని గంటల పాటు ప్రయత్నించినా కుక్కర్​ నుంచి వేరుచేయలేకపోయారు. గుజరాత్​ భావ్​నగర్​లో జరిగిన ఈ ఘటనలో చిన్నారి తలను.. చివరకు కుక్కర్​ నుంచి ఎలా బయటకు తీశారంటే..?

cooker stuck in the head of a one year old girl
కుక్కర్​లో తల ఇరుక్కుపోయి.. తల్లడిల్లిన చిన్నారి
author img

By

Published : Jun 14, 2020, 12:07 PM IST

ఇంట్లో ఉండే వస్తువులతో చిన్న పిల్లలు ఆడుకోవటం సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో వాటి ద్వారానే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనే గుజరాత్​లోని భావ్​నగర్​లో జరిగింది. ఏడాది వయసున్న ఓ చిన్నారి కుక్కర్​తో ఆడుకుంటుండగా.. పాపం అందులో తల ఇరుక్కుపోయింది. గంటల తరబడి ఆ బాధతో తల్లడిల్లింది.

కుక్కర్​ను కత్తిరిస్తున్న కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులు గమనించి కుక్కర్​ నుంచి పాపకు విముక్తి కలిగించాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెంటనే భావ్​నగర్​లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు ముందుగా పాపకు కుక్కర్​ వల్ల అయిన గాయాలకు చికిత్స చేసి, దానిని తీసేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది సుమారు 45 నిమిషాల పాటు కష్టపడినా.. కుక్కర్​ను తీయలేకపోయారు.

cooker stuck in the head of a one year old girl
కుక్కర్​లో ఇరుక్కుపోయిన చిన్నారి తల

చేసేదేమీ లేక.. కుక్కర్లను బాగు చేసే వ్యక్తిని పిలిపించి కట్టర్​తో కత్తిరించారు. చివరకు కుక్కర్ లోంచి పాప తల బయటకు రావడం వల్ల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

పాపకు వైద్యం చేస్తోన్న డాక్టర్లు

కత్తిరించిన కుక్కర్​

ఇదీ చూడండి: ఆహార నాళంలో 6 అంగుళాల టూత్​బ్రష్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.