ETV Bharat / bharat

అదుపులోకి రాని మంటలు.. 7 వేల మంది తరలింపు - oil well fire latest news

అసోం టిన్సుకియా జిల్లాలోని చమురు బావిలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రభావం అధికంగా ఉన్నందున సుమారు 7 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ వేసింది కేంద్ర ఇంధన శాఖ.

oil well fire rages
అదుపులోకిరాని చమురుబావి మంటలు
author img

By

Published : Jun 12, 2020, 12:11 PM IST

అసోంలోని టిన్సుకియా జిల్లాలో ఆయిల్​ ఇండియా లిమిటెడ్​ చమురు బావిలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మరో నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జ్వాలలను అదుపు చేసేందుకు అగ్నిమాపక, ఎన్​డీఆర్​ఎఫ్​, ఇంజినీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

oil well fire rages
కిలోమీటర్​ దూరం నుంచే కనిపిస్తున్న మంటలు

మంటల ధాటికి సమీపంలోని సుమారు 35 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని సుమారు 7 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఈ ఘటనలో ఆయిల్​ ఇండియాకు చెందిన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు.

oil well fire rages
దగ్ధమైన పలు ఇళ్లు

ప్రధాని భరోసా..

ఘటనపై సమాచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం ఫోన్​ ద్వారా తెలియజేశారు అసోం ముఖ్యమంత్రి సర్బానంద్​ సోనోవాల్​. నష్టపోయిన ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని భరోసా ఇచ్చినట్లు పీఎంఓ వెల్లడించింది.

కమిటీ..

ఘటనపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ హైడ్రోకార్బన్స్​(జీడీహెచ్​) డైరెక్టర్​ జనరల్​ ఎస్​సీఎల్​ దాస్​ నేతృత్వంలో ఈ కమిటీ పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తుందని తెలిపింది. ఇందులో ఓఎన్​జీసీ మాజీ ఛైర్మన్​ బీసీ బోరా, మాజీ డైరెక్టర్​ టీకే సేన్​గుప్తా ఉన్నారు. నెల రోజుల లోపు నివేదిక సమర్పించనుంది కమిటీ.

ఉన్నతస్థాయి బృందాలు..

ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేసేందుకు కేంద్రం, అసోం ప్రభుత్వం గురువారం రెండు వేరువేరు ఉన్నతస్థాయి బృందాలను ఏర్పాటు చేసింది.

oil well fire rages
ఎగిసిపడుతున్న జ్వాలలు

ఇదీ చూడండి: చమురుబావిలో మంటలు.. 13రోజులుగా విషవాయువు లీక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.