దిల్లీలో స్వైన్ ఫ్లూ మరోమారు వార్తల్లో నిలిచింది. ఈసారి ఏకంగా ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వైరస్ సోకింది. ఈ విషయాన్ని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు.
సర్వోన్నత న్యాయస్థానంలో పని చేసే వారందరికి స్వైన్ ఫ్లూ సోకకుండా నివారణ చర్యలు చేపట్టాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ బోబ్డేను కోరినట్టు జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఈ విషయమై సీజేఐ.. బార్ అసోసియేషన్తో సమావేశం నిర్వహించినట్లు స్పష్టం చేశారు.