ETV Bharat / bharat

10నెలల్లో 200 మంది ఉగ్రవాదుల ఏరివేత - జమ్ముకశ్మీర్ ఎన్​కౌంటర్ల గణాంకాలు

జమ్ముకశ్మీర్​లో జరిగిన ఉగ్రవాదుల ఎన్​కౌంటర్ల గణాంకాలను వెల్లడించాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (అక్టోబర్ చివరి నాటికి) మొత్తం 200 మంది ముష్కరులను ఏరివేసినట్లు తెలిపాయి. జూన్​లో అత్యధికంగా 49 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పేర్కొన్నాయి.

Number of terrorists killed in Jammu and Kashmir this year
జమ్ముకశ్మీర్ ఎన్​కౌంటర్ల గణాంకాలు
author img

By

Published : Nov 2, 2020, 6:24 PM IST

ఈ ఏడాది అక్టోబర్‌ వరకు జమ్ముకశ్మీర్‌లో వివిధ ఉగ్రసంస్థలకు చెందిన 200 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. వీరిలో అత్యధికులు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన వారే ఉన్నారు. తాజాగా సోమవారం జరిగిన శ్రీనగర్‌ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ సైఫ్‌ ఉల్ ఇస్లాం మిర్‌ కూడా హతమయ్యాడు.

ఈ మేరకు ఎన్‌కౌంటర్ల గణాంకాలను భద్రతా దళాలు వెల్లడించాయి. ఈ ఏడాది జూన్‌లో అత్యధికంగా 49 మంది ముష్కరులను హతమార్చినట్లు తెలిపాయి. ఒక్క నెలలో ఇంత మంది ఉగ్రవాదులను చంపడం ఇదే అత్యధికం. దక్షిణ కశ్మీర్‌లోనే 138 మంది ముష్కరులను మట్టుబెట్టినట్లు పేర్కొన్నాయి.

తాము హతమార్చిన ఉగ్రవాదుల్లో 72 మంది హిజ్బుల్ ముజాహిదీన్‌, 59 మంది లష్కర్‌ ఏ తోయిబా, 32 మంది జైషే మహ్మద్‌ సంస్థలకు చెందిన వారు ఉన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.

గతేడాది 12 నెలల కాలంలో.. 157 మంది ముష్కరులను మట్టు బెట్టినట్లు వెల్లడించాయి.

ఇదీ చూడండి:'రేపిస్టుకు రాఖీ కట్టించడం డ్రామా కాదా?'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.