ETV Bharat / bharat

ఇవి తింటే కరోనాను ఎదుర్కొనే శక్తి మీ సొంతం! - క్యారెట్లు, ఆకుకూరలు ద్వారా వ్యాధి నిరోధకత

కరోనా... ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ వైరస్​ నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు సామాజిక దూరం పాటించడం, రోగ నిరోధక శక్తి పెంచుకోవడమే ఉత్తమ మార్గాలు. సోషల్​ డిస్టెన్సింగ్​ విషయంలో ఇప్పటికే అనేక మందికి అవగాహన వచ్చింది. మరి వ్యాధి నిరోధకత పెంచుకోవడం ఎలా? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

15 Foods That Boost the Immune System
వ్యాధి నిరోధకత పెంచుకోండిలా!
author img

By

Published : Apr 3, 2020, 12:26 PM IST

కరోనా మహమ్మారి వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో అందరిలోనూ ఒకటే ఆలోచన. ఈ మహమ్మారి నుంచి మనల్ని, మన ప్రియమైన వారిని కాపాడుకోవడం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి సమాచారం కోసం దినపత్రికలను తిరగేస్తున్నారు. మహమ్మారి బారిన పడకుండా... వైరస్‌ బాధితులకు దూరంగా ఉండటం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడంతోపాటు వ్యాధి నిరోధక శక్తి(ఇమ్యూనిటీ)ని కలిగి ఉండటమూ అత్యంత కీలకమేనని అకాడమీ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డయటెటిక్స్‌(అమెరికా)కు చెందిన ఆహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో విటమిన్లు, ప్రోటీన్లతో కూడిన బలవర్థక ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏమేమి తినాలి... వాటి ప్రయోజనాలేమిటో వివరిస్తున్నారు.

15 Foods That Boost the Immune System
క్యారెట్లు, ఆకుకూరలు...

క్యారెట్లు, ఆకుకూరలు...

15 Foods That Boost the Immune System
క్యారెట్లు, ఆకుకూరలు...

శరీర ఇమ్యూనిటీకి చోదకంగా పని చేయడంలో విటమిన్‌-ఏ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్ల(విష కణాలు)లను, శరీరంలోకి చొరబడిన వైరస్‌లు, బ్యాక్టీరియాలను బయటకు నెట్టివేయడానికి వ్యాధి నిరోధక వ్యవస్థకు సాయం చేస్తుంది. క్యారెట్లు, ఆకుకూరలు, చిలగడదుంప, బ్రోకోలి, కాలే(క్యాబేజి కుటుంబానికి చెందిన ఆకుకూర), కీరా, మామిడి పండ్లు, కర్బూజా, యాప్రిక్యాట్లలో పుష్కలంగా లభించే బీటా కెరోటిన్‌ అనే పదార్థం విటమిన్‌-ఏగా రూపాంతరం చెందుతుంది.

కమలాలు... ద్రాక్షలు..

15 Foods That Boost the Immune System
కమలాలు... ద్రాక్షలు..

రక్తంలో యాంటీబాడీస్‌ను, తెల్ల రక్తకణాలను వృద్ధి చేయడంలో విటమిన్‌-సీ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. కమలాలు, ద్రాక్ష, కివీ పళ్లు, స్ట్రాబెర్రీలు, బెంగళూరు క్యాబేజీ, మిరియాలు, ఉడికించిన క్యాబేజీ, గోబీ పువ్వుల్లో విటమిన్‌-సీ అధికంగా లభిస్తుంది.

గుడ్లు... పాలు..

15 Foods That Boost the Immune System
గుడ్లు... పాలు..

రక్తంలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపే ప్రోటీన్‌ ఉత్పత్తికి విటమిన్‌-డీ దోహదం చేస్తుంది. ఇది సూర్యరశ్మి నుంచే లభిస్తుంది. ఉష్ణ, సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో సరిపడా ఎండ ఉంటున్నా... చాలామందిలో విటమిన్‌-డీ లోపం కనిపిస్తోంది. చేపలు, గుడ్లు, పాలు, చీజ్‌, వెన్న, పన్నీరు, పుట్టగొడుగులను తింటే ఈ విటమిన్‌ని సూర్యరశ్మి నుంచి శరీరం అధికంగా గ్రహిస్తుంది.

పౌల్ట్రీ ఉత్పత్తులు.. సోయా

15 Foods That Boost the Immune System
పౌల్ట్రీ ఉత్పత్తులు.. సోయా

జింక్‌ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధులతో పోరాడేలా చేస్తుంది. పౌల్ట్రీ ఉత్పత్తులు, జంతు మాంసం, సోయాబీన్‌, శనగలు, చిక్కుళ్లు, చిరు ధాన్యాలు, గింజలు, చీజ్‌, పన్నీరు, యోగర్ట్‌ వంటివాటిలో ఇది లభిస్తుంది.

చేపలు.. శనగలు

15 Foods That Boost the Immune System
చేపలు.. శనగలు

వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే కణాలు, యాంటీబాడీస్‌ను వృద్ధి చేయడంలో ప్రోటీన్లు అత్యంత కీలకం. వ్యవస్థ తన పని తాను చేసుకోవడానికీ సాయం చేస్తాయి. జంతు, వృక్ష సంబంధ పదార్థాల్లో ఇవి లభిస్తాయి. మన భోజనంలో గుడ్లు, చేపలు, మాంసం, పప్పు ధాన్యాలు, గింజలు, విత్తనాలు, పాలు, యోగర్ట్‌ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వేయించిన శనగలు తరచూ తీసుకుంటే ఫలితం లభిస్తుంది.

ద్రవ పదార్థాలు

15 Foods That Boost the Immune System
ద్రవ పదార్థాలు

పోషకాహారంతో పాటు ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. వీటితోపాటు అరటిపండ్లు, బ్రెడ్‌ తరచూ తీసుకుంటూనే వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తుంటే శరీరకంగా, మానసికంగా బలంగా తయారవుతాం. ఏదైనా అనారోగ్యం సంభవిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి వారు సూచించినట్లుగా ఆహారం, మందులను తీసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.