ETV Bharat / bharat

డ్రోన్లు వాడటం ఇక ఈజీ- కొత్త రూల్స్ ఇవే.. - డ్రోన్ రూల్స్ 2021

దేశంలో డ్రోన్ల వాడకం, నియంత్రణ, అనుమతులకు సంబంధించి కేంద్రం నూతన నిబంధనలను రూపొందించింది. డ్రోన్ల వినియోగాన్ని సులభతరం చేసేలా పలు నిబంధనలను సవరించింది. ఈ మేరకు '2021 డ్రోన్ రూల్స్' పేరిట ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.

drone rules
డ్రోన్ రూల్స్
author img

By

Published : Jul 15, 2021, 5:45 PM IST

దేశంలో డ్రోన్ల వాడకాన్ని సులభతరం చేస్తూ రూపొందించిన ముసాయిదా నిబంధనలను పౌర విమానయాన శాఖ విడుదల చేసింది. 'విశ్వసనీయత, స్వీయ ధ్రువీకరణ' వంటి అంశాల ఆధారంగా వీటిని రూపొందించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది.

'డ్రోన్ రూల్స్ 2021' పేరిట ఈ నిబంధనలు విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 12 నుంచి అమలులోకి వచ్చిన మానవరహిత ఎయిర్​క్రాఫ్ట్ వ్యవస్థ నిబంధన(యూఏఎస్-2021)ల స్థానంలో వీటిని తీసుకొచ్చింది. యూఏఎస్ నిబంధనలతో పోలిస్తే తాజా డ్రోన్ రూల్స్ పూర్తిగా భిన్నమైనవని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.

"ప్రపంచంలో అతిపెద్ద సాంకేతిక విప్లవాన్ని డ్రోన్లు తీసుకొస్తున్నాయి. పరిమిత వ్యయం, వనరులు, తక్కువ సమయంతోనే కార్యకలాపాలను పూర్తి చేసేందుకు దోహదం చేస్తున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునే బాధ్యత మనపై ఉంది. ముఖ్యంగా అంకుర పరిశ్రమలకు ఇదో మంచి అవకాశం."

-జ్యోతిరాదిత్య సింధియా, పౌరవిమానయాన శాఖ మంత్రి

ముసాయిదాలోని ముఖ్యాంశాలు

  • డ్రోన్లు వినియోగించేందుకు ఇదివరకు 25 దరఖాస్తులను నింపాల్సి ఉండగా.. తాజా నిబంధనల్లో వీటి సంఖ్యను ఐదుకు కుదించింది కేంద్రం.
  • చెల్లించాల్సిన ఫీజును సైతం కేంద్రం సవరించింది. ఈ నిబంధనల ప్రకారం డ్రోన్ సైజుతో సంబంధం లేకుండా ఫీజు వసూలు చేయనున్నారు.
  • నిర్వహణ ధ్రువీకరణ, దిగుమతి క్లియరెన్సులు, ఆపరేటర్ పర్మిట్, స్టూడెంట్ రిమోట్ పైలట్ లైసెన్స్ వంటి ధ్రువపత్రాల అవసరం లేకుండానే డ్రోన్లు వినియోగించే వీలు.
  • గ్రీన్ జోన్లలో 400 అడుగులు, ఎయిర్​పోర్టులకు 8-12 కి.మీ దూరంలో 200 అడుగుల ఎత్తు వరకు డ్రోన్ల సంచారం కోసం ఎలాంటి ఎయిర్​లైన్ అనుమతులు అవసరం లేదు.
  • డ్రోన్ల డీరిజిస్ట్రేషన్, బదిలీల ప్రక్రియ మరింత సులభతరం.
  • వాణిజ్యేతర కార్యకలాపాల కోసం వినియోగించే మైక్రో డ్రోన్లు, పరిశోధనాభివృద్ధి సంస్థలు ఉపయోగించే నానో డ్రోన్లకు పైలట్ లైసెన్స్ అవసరం లేదు.
  • కార్గో డెలివరీ కోసం డ్రోన్ కారిడార్ల అభివృద్ధి. స్నేహపూర్వక నియంత్రణ వ్యవస్థ కోసం డ్రోన్ ప్రమోషన్ మండలి ఏర్పాటు.
  • దేశంలో రిజిస్టర్ అయిన విదేశీ సంస్థల డ్రోన్ కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు లేవు.

సింగిల్ విండో విధానంలో డ్రోన్లకు అనుమతులు జారీ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందుకోసం డిజిటల్ స్కై ప్లాట్​ఫాం ఏర్పాటు చేస్తున్నట్లు నిబంధనల్లో వెల్లడించింది. చాలా వరకు అనుమతులను మానవ ప్రమేయం లేకుండానే జారీ చేయనున్నట్లు వివరించింది. ఈ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఆగస్టు 5 వరకు తెలియజేయవచ్చని తెలిపింది.

ఇదీ చదవండి: జమ్మూ వైమానిక స్థావరం వద్ద డ్రోన్ కలకలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.