తమిళనాడులోని నమక్కల్ పోలీస్టేషన్ పరిధిలోని అనియాపురంలో ఉండే ఏటీఎంలోని డబ్బును అపహరించడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి దాని వెనుక భాగంలో ఇరక్కుపోయాడు. ఈ వ్యక్తిని బిహార్‌కు చెందిన వలస కూలీ ఉపేంద్రరాయ్గా పోలీసులు గుర్తించారు.
ఇదీ జరిగింది..
ఉపేంద్ర రాయ్ అనే యువకుడు స్థానికంగా ఉండే పౌల్ట్రీ ఫీడ్ ఫ్యాక్టరీలో ప్యాకర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అక్కడ ఉన్న ఏటీఎంలోని డబ్బును చోరీ చేయాలని అనుకున్నాడు. తెల్లవారుజామున ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అక్కడ ఉండే అలారం మోగింది. దీంతో దొంగ ఏటీఎంకు వెనుక భాగంలో నక్కేందుకు చూసి అందులో ఇరుక్కుపోయాడు. ఈ సమయంలో అతను చేస్తున్న శబ్దాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు లోపలికి వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. ఏటీఎం పై భాగంలో ఉపేంద్ర ఇరుక్కునిపోయి ఉండడం గమనించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.
ఇదీ జరిగింది: సినిమా సీన్‌ను తలపించిన యాక్సిడెంట్- 22 మంది సేఫ్