ETV Bharat / bharat

CI Swarnalata: 'సినిమా' కోసం తప్పులు.. వారి అండతోనే.. వైరల్​గా మారిన సీఐ స్వర్ణలత డాన్స్​ వీడియో - ARCI Swarnalata Crime

AR CI Swarnalata: నోట్ల మార్పిడి వ్యవహారంలో బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఏఆర్‌ సీఐ స్వర్ణలత అరెస్టు కావడం సంచలనం సృష్టిస్తోంది. వృత్తిలో అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె.. ప్రవృత్తి పరంగా వెండితెరపై మక్కువ ఏర్పర్చుకున్నారు. అవకాశాల కోసం అధికార పార్టీ నేతలతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. అందుకోసం తెలుగుదేశం నేతలపై పంచ్‌ డైలాగ్‌లతో విమర్శలు చేశారు.

AR CI Swarnalata
'సినిమా' కోసం తప్పులు.. వైరల్​గా మారిన సీఐ స్వర్ణలత డాన్స్​ వీడియో
author img

By

Published : Jul 8, 2023, 7:28 AM IST

'సినిమా' కోసం తప్పులు.. వారి అండతోనే.. వైరల్​గా మారిన సీఐ స్వర్ణలత డాన్స్​ వీడియో

AR CI Swarnalata: 'AP31'.. ఇదేమీ వాహన రిజిస్ట్రేషన్‌ నెంబరు కాదు. విశాఖకు చెందిన మహిళా రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత నటిస్తున్న సినిమా పేరు. నోట్ల మార్పిడి కేసులో కొందరు వ్యక్తులను బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజిన కేసులో.. స్వర్ణలత అరెస్టు కావడం పోలీసు శాఖలో సంచలనంగా మారింది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదైంది. తాను నటిస్తున్న ‘AP31’ చిత్ర నిర్మాణ వ్యవహారాల పర్యవేక్షణలోనూ స్వర్ణలత భాగస్వామి అయినట్లు సమాచారం. అందుకు అవసరమైన డబ్బుల కోసమే నోట్ల మార్పిడిలో కీలకంగా వ్యవహరించారా అనే విమర్శలు వస్తున్నాయి. కొందరు రియల్టర్లతోనూ ఆమెకు పరిచయాలు ఉన్నాయి. వారి నుంచి కమీషన్‌ తీసుకున్న సీఐ స్వర్ణలత.. నోట్లు మార్పిడి చేసుకోవాలని చూసేవారికి కొన్ని ప్లాట్లు కూడా బుక్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

వీడియోతో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌.. సినిమాలపై ఆసక్తి ఉన్న స్వర్ణలత.. కొంత కాలం క్రితం ఓ పాటకు డ్యాన్స్‌ చేశారు. చిరు ప్రయత్నం అంటూ ఆ వీడియోతో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశారు. తాను తీసే సినిమాలో మంచి పాత్ర ఇస్తానని, అందుకు నృత్యంలో ప్రావీణ్యం ఉండాలని ఒక ప్రజాప్రతినిధి చెప్పటంతో.. కొరియోగ్రాఫర్‌ను నియమించుకుని సాధన చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు వీడియోలు తీశారు.

వైఎస్సార్​సీపీ నేతలతో పరిచయాలు.. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో స్వర్ణలతకు వైఎస్సార్​సీపీ నేతలతో పరిచయాలు పెరిగాయి. జీవీఎంసీ ఎన్నికల్లో ఆమెకు బంధువైన ఓ మహిళా అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. కొన్నాళ్ల కిందట తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఏపీ పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలి హోదాలో పంచ్‌ డైలాగ్స్‌తో విరుచుకుపడ్డారు. పోలీసులకు రాజకీయాలు ముడిపెట్టి మాట్లాడుతున్నారంటూ అయ్యన్నపై ఓ స్క్రిప్ట్‌ రాసుకువచ్చి ప్రెస్‌మీట్‌లో చదివి వినిపించారు. ఇదంతా వైఎస్సార్​సీపీ నేతల సూచనలతో జరిగిందనే ప్రచారం సాగింది. నోట్ల మార్పిడి కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేయగా.. కేసు పెట్టకుండా ఆమెకు సన్నిహితుడైన ఓ కీలక ప్రజాప్రతినిధి విశ్వప్రయత్నాలు చేశారు. తన వల్ల కాదని తేలడంతో వైఎస్సార్​సీపీ ముఖ్య నేతలను అభ్యర్థించి ఆమెపై కేసు తీవ్రతను తగ్గించేలా ఒత్తిళ్లు తెచ్చారంటే.. స్వర్ణలత రాజకీయ సంబంధాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందని తెలుగుదేశం నేతలు అంటున్నారు.

వైసీపీ నేతల సిఫార్సుతో నగరానికి.. ఏఆర్‌ హోంగార్డు ఎస్సైగా పనిచేస్తున్నప్పుడే.. హోంగార్డు నియామకాల విషయంలో స్వర్ణలతపై అనేక ఆరోపణలొచ్చాయి. ఆ తర్వాత విజయవాడకు బదిలీ చేయగా, కొంత కాలం పనిచేసి శ్రీకాకుళం ఏఆర్‌కు వచ్చారు. అక్కడ పనిచేస్తుండగా జిల్లాల విభజన జరగడంతో బదిలీపై అనకాపల్లి జిల్లాకు వెళ్లారు. విశాఖలో ఖాళీ ఉండటంతో అధికార వైఎస్సార్​సీపీ నేతల సిఫార్సుతో నగరానికి వచ్చారు. కొంతకాలం సిటీ ట్రైనింగ్‌ సెంటర్‌లో పనిచేసి.. తర్వాత హోంగార్డుల రిజర్వు ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. హోంగార్డుల నిర్వహణ విషయంలోనూ స్వర్ణలత అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.