APPSC Group 2 Notification 2023: రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు , 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కలిపి మొత్తం 897 పోస్టుల భర్తీకి ప్రకటన ఎపీపీఎస్సీ జారీ చేసింది. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 న గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. స్వల్పంగా మార్పు చేసి రూపొందిచిన నూతన సిలబస్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్నట్లు ఎపీపీఎస్సీ తెలిపింది. డిగ్రీ , ఆపై విద్యార్హత అర్హత కల్గిన వారు గ్రూప్ 2 ఉద్యోగాలకు అర్హులుగా తెలిపింది. ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో అత్యధికంగా అబ్కారీ శాఖ లో 150 ఎస్ ఐ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత రెవెన్యూ విభాగంలో 114 డిప్యూటీ తహసిల్దారు పోస్టులు ఉన్నాయి. మొత్తం 8 విభాగాల్లో కలిపి 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎపీపీఎస్సీ తెలిపింది. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఎపీ సెక్రటేరియట్ లో అత్యధికంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 218 ఖాళీగా ఉన్నాయి. సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 23, ఎపీపీఎస్సీ లో 32 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 59 విభాగాల్లో కలిపి మొత్తం 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఎపీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంబంధించి పూర్తి వివరాలు, వయసు, విద్యార్హతలు, రిజర్వేషన్లు , సిలబస్ , పరీక్షా విధానం ,తదితర వివరాలతో కూడిన నోటిఫికేషన్ ను ఎపీపీఎస్సీ వెబ్ సైట్లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.
గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - గ్రూప్ 2 నోటిఫికేషన్ సమాచారం

Published : Dec 7, 2023, 8:29 PM IST
|Updated : Dec 7, 2023, 10:29 PM IST
20:27 December 07
897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ