ETV Bharat / bharat

యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభను విఫలం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు - విజయనగరంలో యువగళం ముగింపు సభ

AP Government Obstacles to Yuvagalam Jaitrayatra Vijayotsava Sabha : ఏపీలో యువగళం పాదయాత్ర విజయవంతంగా ముగిసినా ఆటంకాలు, అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 20న నిర్వహించే జైత్రయాత్ర విజయోత్సవ సభకు బస్సులు ఇచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ ససేమిరా అంటోంది. ప్రైవేటు బస్ ఆపరేటర్లు, విద్యాసంస్థల యాజమాన్యాలనూ ఇవ్వొద్దని రవాణా శాఖ హెచ్చరిస్తోంది. ఆంధ్రా వర్శిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణం ఇచ్చేందుకు వీసీ నిరాకరించారు. అధికారులు వైఎస్సార్సీపీ తొత్తుల్లా మారిపోయారని తెలుగుదేశం మండిపడుతోంది.

AP_Government_Obstacles_to_Yuvagalam_Jaitra_Yatra_Vijayotsava_Sabha

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 7:01 AM IST

Updated : Dec 19, 2023, 8:56 AM IST

యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభను విఫలం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు

AP Government Obstacles to Yuvagalam Jaitra Yatra Vijayotsava Sabha : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర జైత్రయాత్ర విజయోత్సవ సభకు అవరోధాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఏపీలోని నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో సభ విజయవంతం కాకుండా చూసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ అధికారులు సభకు పూర్తి సహాయ నిరాకరణ చేస్తున్నారు.

No APSRTC Buses to Yuvagalam Jaitra Yatra Vijayotsava Sabha : సభకు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం బస్సులు ఇచ్చేందుకు ససేమిరా అంది. చివరకు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలపై కూడా ప్రభుత్వం ఒత్తిడితెస్తోంది. తెలుగుదేశం పార్టీ సభకు బస్సులు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సంబంధిత శాఖల అధికారులతో హెచ్చరికలు చేయిస్తోంది. వైఎస్సార్సీపీ సభలకు కోరిన వెంటనే వందలకొద్దీ బస్సులు కేటాయిస్తున్న అధికారులు విపక్షాల సభలకు బస్సులు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. 2022లో ఒంగోలులో, ఈ ఏడాది మేలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు సభలకూ బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసీ తిరస్కరించింది. యువగళం విజయోత్సవ సభకు తెలుగుదేశం పార్టీ కోరిన వెంటనే రైల్వేశాఖ ఐదు ప్రత్యేక రైళ్లను కేటాయించింది.

20న టీడీపీ యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభ: అచ్చెన్నాయుడు

Nara Lokesh Yuvagalam Closing Ceremony in Vizianagaram District : పాదయాత్ర విజయోత్సవ సభను మొదట విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించాలని భావించిన తెలుగుదేశం పార్టీ వీసీని అనుమతి కోరుతూ లేఖ రాసింది. దానిపై ఎటూ తేల్చకుండా నాన్చిన వీసీ చివరకు ఆర్గానిక్‌ మేళా జరుగుతోందన్న సాకుతో అనుమతి నిరాకరించారు. ఆర్గానిక్‌ మేళా ఈ నెల 17తోనే ముగిసింది. దీన్ని బట్టి అది కేవలం సాకేనని స్పష్టమవుతోంది. మతపరమైన కార్యక్రమాలకు విద్యా సంస్థల ఆవరణలో అనుమతివ్వరాదని జీవో ఉన్నా అదే ఇంజినీరింగ్‌ కళాశాల గ్రౌండ్‌లో వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక వివిధ మతపరమైన కార్యక్రమాలకూ అనుతులిచ్చారు. అప్పుడు ఈ జీవోలు గుర్తుకు రాలేదా? అని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి.

యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభ - ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన టీడీపీ

TDP Leaders Comments on Yuvagalam Vijayotsava Sabha : ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేస్తామని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జరిగే యువగళం విజయోత్సవ సభకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ సహా ఇరుపార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. ఈ సభావేదికపై నుంచే ఇరు పార్టీల అధినేతలు సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించే అవకాశం ఉంది. 110 ఎకరాల స్థలంలో నిర్వహించే విజయోత్సవ సభలో సుమారు 6 లక్షల మంది పాల్గొంటారన్న అంచనాతో అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

యువగళం విజయోత్సవ సభకు భారీ ఏర్పాట్లు - లక్షలాదిగా తరలిరానున్న అభిమానులు

Last Updated : Dec 19, 2023, 8:56 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.