AP CID Officials at Kolikapudi Srinivasa Rao House: ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు. రాంగోపాల్ వర్మ ఫిర్యాదు నేపథ్యంలో శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వెళ్లిన ఏపీ సీఐడీ అధికారులు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలోని కొలికపూడి ఇంటికి వచ్చినట్లు సమాచారం. కొలికపూడిని అరెస్టు చేసేందుకే సీఐడీ బృందం హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇంట్లో లేకపోవడంతో కొలికపూడి భార్యను ఆఫీసు నుంచి ఇంటికి రావాలని కోరారు. ఆ తరువాత సీఐడీ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం కొలికపూడి శ్రీనివాసరావు తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
AP CID Notices to Kolikipudi Srinivasa Rao Wife Madhavi: ఏపీ సీఐడీ అధికారులు కొలికిపూడి శ్రీనివాసరావు సతీమణి మాధవికి నోటీసులు అందజేశారు. వచ్చె నెల 3వ తేదీన గుంటూరు సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరుకు సీఐడీ పోలీసులు శ్రీనివాసరావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆర్జీవీ ప్రాణభయంతో తమకు ఫిర్యాదు చేశారని అందులో భాగంగానే కేసు నమోదు చేశామని ఏపీ సీఐడీ పోలీసులు పేర్కొన్నారని మాధవి తెలిపారు.
6 గంటల విచారణ తర్వాత సాఫ్ట్వేర్ రామును వదిలిపెట్టిన సీఐడీ - 28న రావాలని నోటీసులు
Kolikapudi Srinivasa Rao Comments on RGV: కొద్ది రోజుల క్రితం కొలికపూడి శ్రీనివాసరావు ఓ ఛానల్‌లో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించగా అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు కొలికపూడి సమాధానాలు చెప్తూ 'రామ్‌గోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తా’ అంటూ ఛాలెంజ్ చేశారు. వెంటనే షోలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చట్ట ప్రకారమే మాట్లాడాలని, అలానే కొలికపూడి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అడిగినా వినకుండా ‘'ఐ రిపీట్, ఐ రిపీట్ నాకు సమాజం కంటే ఏదీ ఎక్కువ కాదు'’ అంటూ కొలికపూడి రెచ్చిపోయారు.
Ramgopal Verma Complained to AP DGP: కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలపై రామ్‌గోపాల్ వర్మ స్పందించి ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో "కొలికపూడి శ్రీనివాస్ లైవ్ టీవీ షోలో నన్ను చంపి నా తలను తీసుకువచ్చిన వాడికి కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ఆఫర్ ఇచ్చాడు. ఇదే కాకుండా నన్ను నా ఇంటి కొచ్చి తగలబెడతానని పబ్లిక్‌గా అదే టీవీలో చెప్పాడు. ఆపుతున్నట్లు నటిస్తూ యాంకర్ నన్ను చంపే కాంట్రాక్ట్ గురించి మూడు సార్లు రిపీట్ చేయించాడు. ఆ తరువాత కూడా శ్రీనివాస రావుతో చర్చ కొనసాగించారు.
సీఐడీలో ఇంటి దొంగలు! - అభయ గోల్డ్ ఆస్తులు కారు, బైక్, సామగ్రి మాయం
దీన్ని బట్టి వాళ్లిద్దరూ నన్ను చంపటానికి కాంట్రాక్ట్ ఇవ్వటానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. శ్రీనివాసరావు నన్ను మర్డర్ చెయ్యటం కన్నా దారుణం లైవ్ టీవీలొ కూర్చుని నన్ను చంపితే కోటి రూపాయలు ఇస్తానని వేరే ఎవరెవరికో డబ్బు ఆశ చూపి ప్రేరేపించడంలాంటిదే. హత్య, కుట్రలు తన ఛానల్‌లో ప్రసారమవుతున్నాయని తెలిసినా యాంకర్‌ను జాబ్ నుంచి తియ్యలేదంటే వారు కూడా ఈ కుట్రలో భాగంగా ఉన్నట్టు తెలిసిపోతోంది. ఒక డెమోక్రసీలొ హత్య కాంట్రాక్టులు ఇంత పబ్లిక్‌గా ఇవ్వటం చూస్తే టెర్రరిస్టులు కూడా షాక్ అవుతారు. కాబట్టి ముగ్గురి మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి" అంటూ పేర్కొన్నారు.