ETV Bharat / bharat

Margadarshi Chitfunds: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌‌పై కక్షపూరితంగా, పక్షపాతంగా వ్యవహరించవద్దు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి - Andhra Pradesh political news

AP CID raids on Margadarshi Chitfunds updates: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్దిగాంచిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలపై గతకొన్ని రోజులుగా ఏపీ సీఐడీ పోలీసులు ఇష్టారీతిగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ దాడులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి స్పందించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌‌పై కక్షపూరితంగా, పక్షపాతంగా వ్యవహరించవద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

AP CID
AP CID
author img

By

Published : Apr 13, 2023, 3:59 PM IST

AP CID raids on Margadarshi Chitfunds updates: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలపై గతకొన్ని రోజులుగా ఏపీ సీఐడీ పోలీసులు చేస్తున్న దాడులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి స్పందించారు. మార్గదర్శిపైనే కాదు, సమాజంలోని ఏ సంస్థపైనా అక్రమ కేసులు పెట్టాడాన్ని కేంద్రం సహించబోదని.. కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రోజ్‌గార్‌ యోజన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి.. మార్గదర్శి దాడులపై స్పందించారు.

మార్గదర్శిపై ఏపీ సీఐడీ అధికారుల వైఖరి సరికాదు.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని ఏ సంస్థపై అక్రమంగా దాడులు చేయడం మంచిది కాదన్నారు. ఆ దిశలోనే ఈరోజు అన్ని సంస్థలపైనా కక్ష సాధింపులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధినేతలపై ఉందని ఆయన గుర్తు చేశారు. మార్గదర్శి చిట్స్‌ఫండ్ సంస్థలపై జరుగుతున్న దాడుల విషయంలో అక్రమంగా ఎక్కడ కూడా కక్ష పూరితంగా, పక్షపాతంగా వ్యవహరించవద్దని సీఐడీ అధికారులకు సూచించారు. మార్గదర్శి సంస్థలపై ఏపీ సీఐడీ అధికారుల పక్షపాత వైఖరి సరికాదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హితవు పలికారు.

కావాలనే కేసులు పెట్టి, దాడులు చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీ రెడ్డి మాట్లాడుతూ.. ''మార్గదర్శి మీద ప్రజలెక్కడా ఫిర్యాదు చేయకున్నప్పటికీ కావాలనే కేసులు పెట్టి, దాడులు చేస్తున్నారు. చిట్టీ డబ్బులు ఇవ్వలేదని ఫిర్యాదు చేస్తేనే కేసు పెట్టాలి. ఒకవేళ చిట్టి డబ్బులు ఇవ్వకపోతే 420, 477, 409 సెక్షన్ల కింద మాత్రమే కేసులు పెట్టాలి. కానీ, మార్గదర్శి విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేకున్నా కేసులు పెట్టి, దాడులు చేస్తున్నారు. ఆర్‌ఓసీ, ఆర్‌బీఐకి మార్గదర్శి ఇదివరకే తన పూర్తి వివరాలు సమర్పించింది. వారికి లేని అనుమానాలు, ఇబ్బందులు జగన్‌కు ఎందుకు..?. మార్గదర్శి సంస్థ 62 ఏళ్లుగా తన వ్యాపార కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. వచ్చిన రూ.1500 కోట్ల లాభాన్ని మ్యూచివల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టింది. మార్గదర్శి షూరిటీ ఇవ్వలేని వారి డబ్బు రూ. 180 కోట్లు. వారికి కూడా ఇంట్రస్ట్‌తో సహా ఇచ్చింది. ఏ బ్రాంచిలో డబ్బులు ఆ బ్రాంచిలోనే ఉన్నాయి.'' అని ఆయన అన్నారు.

న్యాయవాదులకు, ఆడిటర్లకు, జర్నలిస్ట్‌లకు నోటీసులు.. మరోవైపు మార్గదర్శి ఆడిటర్‌ శ్రావణ్‌ అరెస్ట్‌పై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడిన పలువురు న్యాయవాదులకు, ఆడిటర్లకు, జర్నలిస్ట్‌లకు ఏపీ సీఐడి నోటీసులను జారీ చేసింది. తమ వద్ద ఆధారాలు ఉంటే, విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. 160 సీఆర్‌పీసీ ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. 160సీఆర్‌పీసీ ప్రకారంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులకు నోటీసులు ఇవ్వరాదని స్పష్టంగా ఉన్నా.. సీఐడీ పోలీసులు వాటిని పట్టించుకోలేదని ఏపీ బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు.

అనంతరం నోటీసులకు తాము బెదిరేది లేదని, ప్రశ్నించే గొంతులను నొక్కేందుకే నోటీసులు జారీ చేశారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత అభిప్రాయాలను తెలిపే హక్కు ఎవరికైనా ఉందని ఆయన గుర్తు చేశారు. న్యాయవాదులకు ఇటువంటి నోటీసులు ఇవ్వడం సరికాదని, దీనిపై భవిష్యత్తులో ఎలాగ ముందుకు వెళ్లాలనే దానిపైనా న్యాయవాదులంతా చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. గవర్నర్‌ను కలిసి కూడా వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.