ETV Bharat / bharat

త్రిపురలో త్రిముఖ పోటీ.. గెలిచేది కాషాయమా.. కమ్యూనిస్టులా?.. 'తిప్ర' సత్తా ఎంత? - త్రిపుర ఎన్నికలు 2023 పొత్తులు

త్రిపురలో ఈ సారి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్​తో దోస్తీ కట్టి అధికార భాజపాను గద్దె దించాలని వామపక్షం భావిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ పోటీకి దూరంగా ఉంటున్నారు. ఆయన కేవలం ప్రచార బాధ్యతలకే పరిమితం అయ్యారు. మరోవైపు, భాజపాలో అంతర్గత సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. మూడో పక్షంగా తిప్ర రంగంలోకి దిగింది.

analysis-on-tripura-election-2023
త్రిపుర ఎన్నికలు 2023 విశ్లేషణ
author img

By

Published : Feb 5, 2023, 7:04 AM IST

Updated : Feb 5, 2023, 9:35 AM IST

ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నెలలో శాసనసభ ఎన్నికలు జరగనున్న మూడు రాష్ట్రాల్లో త్రిపుర ఎన్నికలు ఆసక్తికరంగా నిలుస్తున్నాయి. మేఘాలయ, నాగాలాండ్‌లలో ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. ఆ రాష్ట్రాలపై భాజపాకు పెద్దగా ఆశలు లేవు. త్రిపురలో మాత్రం తిరిగి అధికారం నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది. 1993 నుంచి పాతికేళ్ల పాటు అప్రతిహతంగా సాగిన కమ్యూనిస్టుల పాలనకు 2018 ఎన్నికల్లో భాజపా తెరదించింది. ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిస్థాయి పట్టు సాధించాలంటే త్రిపురలో మరోసారి గెలుపు భాజపాకు అత్యవసరం. మరోవైపు పూర్వవైభవం సాధించేందుకు సీపీఎం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఒకప్పటి ప్రత్యర్థి, ప్రస్తుతం రాష్ట్రంలో నామమాత్రంగా మారిన కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. ఓ వైపు భాజపా- ఇండీజినస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపీఎఫ్‌టీ-బీ) కూటమి, మరోవైపు వామపక్ష-కాంగ్రెస్‌ కూటమి తలపడుతుండగా మూడో పక్షంగా 'ది ఇండీజినస్‌ ప్రోగ్రెసివ్‌ రీజనల్‌ అలయెన్స్‌' (తిప్ర) రంగంలో ఉంది. 2021లో జరిగిన త్రిపుర స్వయంపాలిత జిల్లా కౌన్సిల్‌ ఎన్నికల్లో తిప్ర ఘన విజయం సాధించింది.

.

పొత్తులు.. కుమ్ములాటలు..
త్రిపురలోని 60 శాసనసభ స్థానాల్లో భాజపా 55 చోట్ల పోటీచేస్తూ అయిదు స్థానాలను మిత్రపక్షం ఐపీఎఫ్‌టీకి కేటాయించింది. సీపీఎం 43 స్థానాల్లో పోటీ చేస్తూ కాంగ్రెస్‌కు 13, సీపీఐ, ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్‌, స్వతంత్ర అభ్యర్థికి ఒక్కో స్థానాన్ని కేటాయించింది. తిప్ర మోథా ఒంటరిగా 42 స్థానాల్లో పోటీ చేస్తోంది. తిప్ర మోథా ప్రభావం 20 స్థానాలపై తీవ్రంగా పడనుంది. గత ఎన్నికల్లో భాజపా గెలుపులో ఐపీఎఫ్‌టీ కీలక పాత్ర పోషించింది. ఆ ఎన్నికల్లో ఐపీఎఫ్‌టీ ఎనిమిది స్థానాలు గెలవడమే కాకుండా మరో 10-15 స్థానాల్లో భాజపా గెలుపునకు దోహదపడింది. తిప్ర మోథా ఆవిర్భావంతో ఐపీఎఫ్‌టీ ప్రభావం తగ్గిపోవడంతో భాజపా ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి అయిదు సీట్లు మాత్రమే కేటాయించింది. ఐపీఎఫ్‌టీ గిరిజనుల్లో పట్టు కోల్పోయిందనే కారణాన్ని భాజపా చూపడం ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఐపీఎఫ్‌టీ సిట్టింగ్‌ స్థానం ఆంపీనగర్‌లోనూ భాజపా తన అభ్యర్థిని ప్రకటించింది. భాజపా తీరును వ్యతిరేకిస్తూ ఐపీఎఫ్‌టీ అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సింధు చంద్ర జమాతియాను బరిలో నిలిపింది.

.

కలహాలు.. కీచులాటలు..
25 ఏళ్ల సీపీఎం పాలన అనంతరం 2018లో త్రిపురలో భాజపా అధికారం దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా బిప్లవ్‌దేవ్‌ను నియమించింది. బిప్లవ్‌దేవ్‌ తీరును నిరసిస్తూ పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడడం, త్రిపుర స్వయంపాలిత జిల్లా కౌన్సిల్‌ ఎన్నికల్లో భాజపా ఓటమి పాలవడంతో ఆయనను పక్కకు తప్పించి మాణిక్‌ సాహాను ముఖ్యమంత్రిగా భాజపా నియమించింది. ఈ మార్పు పార్టీలో అసమ్మతిని తగ్గించకపోగా మరింతగా పెంచేందుకు కారణమైంది. పార్టీ గెలుపుపై అసమ్మతి రాజకీయాలు ప్రభావం చూపుతాయని భావించిన భాజపా అధిష్ఠానం ప్రతి సీటును గెలుచుకునేందుకు గట్టిగా శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రిగా ఉన్న ప్రతిమా భౌమిక్‌ను శాసనసభ ఎన్నికల బరిలో నిలిపింది. అధికారం తిరిగి కైవశం చేసుకోవాలనుకుంటున్న సీపీఎంకు ఇబ్బందులు తప్పడం లేదు. కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవడాన్ని సీపీఎం శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. రెండు శాతం ఓట్లు లేని కాంగ్రెస్‌కు 13 సీట్లు కేటాయించడాన్ని తప్పుపడుతున్నాయి. రెండు కూటముల హోరాహోరీ పోరులో సంకీర్ణం ఏర్పడితే తిప్ర మోథా గెలిచే సీట్లు కీలకం కావడం ఖాయం.

ప్రచార బాధ్యతల్లో మాణిక్‌ సర్కార్‌..
త్రిపుర అంటే గుర్తుకొచ్చే పేరు మాణిక్‌ సర్కార్‌. సుదీర్ఘకాలం సాగిన సీపీఎం పాలనలో 20 ఏళ్లు ఆయనే ముఖ్యమంత్రి. 1983 ఎన్నికల్లో అగర్తల శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా మాణిక్‌ సర్కార్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1988 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి కేవలం 81 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1993 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న మాణిక్‌ సర్కార్‌ 1998, 2003, 2008, 2013, 2018 ఎన్నికల్లో ధన్‌పూర్‌ శాసనసభ స్థానం నుంచి గెలుపొందారు. 1998 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ప్రస్తుత ఎన్నికల్లో మాణిక్‌ సర్కార్‌తో పాటు హృషముఖ్‌ నుంచి ఎనిమిదిసార్లు గెలుపొందిన బాదల్‌ చౌదరికి అనారోగ్య కారణాలతో సీపీఎం సీటు నిరాకరించింది. మాణిక్‌ సర్కార్‌కు ప్రచార బాధ్యతలను అప్పగించింది.

Last Updated : Feb 5, 2023, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.