ETV Bharat / bharat

'సాగర్'​ సమీపంలో కూలిన ఆర్మీ హెలికాప్టర్​ - హెలికాప్టర్​ ప్రమాదం

Army helicopter crashes
కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్​
author img

By

Published : Aug 3, 2021, 11:55 AM IST

Updated : Aug 3, 2021, 1:19 PM IST

11:52 August 03

'సాగర్'​ సమీపంలో కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్​

వైమానిక దళ హెలికాప్టర్ ఒకటి జమ్ము-కశ్మీర్ కతువా జిల్లా పరిధి రంజిత్ సాగర్ జలాశయంలో కూలింది. ఈ విషయాన్ని పఠాన్‌కోట్‌ ఎస్‌ఎస్‌పీ సురీందర్ లంబా తెలిపారు. ఆ హెలికాప్టర్​ ఉదయం పదిన్నర ప్రాంతంలో మమున్ కాంట్ నుంచి గాలిలోకి ఎగిరినట్లు వెల్లడించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే జలాశయంలో కూలినట్లు చెప్పారు.

ప్రమాద స్థలంలో జాతీయ విపత్తు నిర్వహణ బృందం సహాయచర్యలు చేపట్టిందని పేర్కొన్నారు లంబా. ఈ ప్రమాదంలో ఎవరైనా మృతి చెందారా? ప్రమాదానికి కారణాలు ఏమిటి? అనేది ఇంకా తెలియాల్సి ఉందని వివరించారు.

హెలికాప్టర్‌ కూలిన ప్రదేశం పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానికి స్థావరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Last Updated : Aug 3, 2021, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.