Alappuzha politicians killing: కేరళలోని అలప్పుజ జిల్లాలో రాజకీయ నాయకుల వరుస హత్యలు కలకలం రేపాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్.. శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
![KERALA POLITICIANS KILLINGS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13948827_sdpi.jpg)
SDPI leader killed Kerala
బైక్‌పై వెళ్తున్న షాన్‌ను కారులో వచ్చిన దుండగులు ఢీకొట్టారు. కింద పడిపోయిన ఆయనను దుండగులు తీవ్రంగా కొట్టారు. గాయపడ్డ షాన్‌ను కొచ్చిలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని ఎస్డీపీఐ ఆరోపించింది.
భాజపా నేత హత్య
కాగా, 12 గంటల వ్యవధిలో భాజపా నేత ఆ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజీత్ శ్రీనివాస్ హత్యకు గురయ్యారు. ఆదివారం ఉదయం కొందరు దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి హత్య చేశారు. షాన్ మృతికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
![KERALA POLITICIANS KILLINGS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13948827_bjp.jpg)
దీంతో అలప్పుజలో ఆంక్షలు విధించారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం పినరయి విజయన్ ఈ ఘటనలను ఖండించారు.
ఇదీ చదవండి: గ్యాంగ్‌రేప్ కేసులో 13మందికి 20 ఏళ్ల జైలు శిక్ష