ETV Bharat / bharat

'సర్​ప్రైజ్ ఇస్తా.. కళ్లు మూసుకో' అని కత్తితో పొడిచి హత్య.. శవాన్ని ముక్కలు చేసి.. - గన్​​తో కాల్చుకుని ఆర్మీ అధికారి ఆత్మహత్య

తన భార్యను వేధిస్తున్నాడనే కోపంతో స్నేహితుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. అనంతరం సాక్ష్యాలు లభించకుండా ఉండేందుకు శరీరాన్ని ముక్కముక్కలుగా చేసి చెత్తకుప్పలో వేశాడు. ఈ ఘటన గుజరాత్​ అహ్మాదాబాద్​లో జరిగింది.

man killed his friend
man killed his friend
author img

By

Published : Mar 30, 2023, 7:54 AM IST

Updated : Mar 30, 2023, 9:54 AM IST

గుజరాత్ అహ్మదాబాద్​లో దారుణ ఘటన జరిగింది. తన భార్యను వేధిస్తున్నాడనే కోపంతో స్నేహితుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. అనంతరం సాక్ష్యాలు లభించకుండా ఉండేందుకు శరీరాన్ని ముక్కముక్కలుగా చేసి చెత్తకుప్పలో వేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాపునగర్ పోలీస్ స్టేషన్​ పరిధిలో నివసించే మహ్మద్​ మీరజ్, మహ్మాద్​ ఇమ్రాన్​​ ఇద్దరు స్నేహితులు. ఇమ్రాన్​ కోసం ఇంటికి వెళ్లే మీరజ్​.. అతడి భార్యను తరుచూ వేధించేవాడు. దీనిపై ఆగ్రహించిన ఇమ్రాన్​.. ఇంటికి రావద్దని హెచ్చరించాడు. అయినా మీరజ్ తీరు మారకపోవడం వల్ల అతడిని చంపాలని ఇమ్రాన్ ప్లాన్ చేశాడు. దీనికి అతడి భార్య కూడా సహాయం చేసింది. సర్​ప్రైజ్​ గిఫ్ట్​ ఇస్తామంటూ మీరజ్​ను ఇద్దరు కలిసి ఇంటికి పిలిచారు. అతడి కళ్లకు గంతలు కట్టి.. కత్తితో పొడిచారు. అనంతరం సాక్ష్యాలు లభించుకుండా ఉండేందుకు శరీరాన్ని ముక్కముక్కలుగా నరికి చెత్తకుప్పలో వేశారు.

అయితే, కొన్ని రోజులుగా తమ కుమారుడు కనిపించకపోవడం వల్ల మీరజ్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతడి స్నేహితుడు ఇమ్రాన్​పై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. తన భార్యను వేధిస్తున్నందునే హత్య చేశానని ఒప్పుకున్నాడు. అనంతరం ఇమ్రాన్​ను తీసుకెళ్లి శరీర భాగాలను సేకరించారు. నిందితుడు మహ్మాద్​ ఇమ్రాన్​ సహా అతడి భార్యను అరెస్ట్ చేశారు పోలీసులు.

ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ ఘటన ఝార్ఖండ్​లోని పలామూ జిల్లాలో జరిగింది. ఇద్దరు కూతుళ్లు, కుమారుడితో కలిసి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన డల్టన్​​గంజ్​ రైల్వే స్టేషన్​కు రెండు కిలోమీటర్ల దూరంలో జరిగింది. వీరిని హరిహరగంజ్​ ప్రాంతానికి చెందిన మనితాదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు, కుమారుడిగా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్​మార్టమ్​ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సర్వీస్​ రైఫిల్​తో కాల్చుకుని ఆర్మీ అధికారి ఆత్మహత్య
తమిళనాడుకు చెందిన ఓ ఆర్మీ అధికారి సర్వీస్​ రైఫిల్​తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో జరిగింది. మదురై జిల్లాకు చెందిన విగ్నేశ్ సుందర్​.. భంథారా ఎయిర్​ స్టేషన్​లో సిగ్నల్​ అసిస్టెంట్​గా పని చేస్తున్నాడు. బుధవారం అతడికి గార్డ్ పోస్ట్ వద్ద సెంట్రీ విధులు వేయగా.. అక్కడే గన్​తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న భంథారా పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

tamil nadu army man suicide case
ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ అధికారి

9 ఏళ్ల బాలిక గొంతుకోసి హత్య
జమ్ముకశ్మీర్ కుప్వారాలో ఘోరం జరిగింది. 9 ఏళ్ల బాలికను గొంతు కోసి చంపారు దుండగులు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఖుర్హామ సమీపంలో జాబ్​ గ్రామంలో విడిచిపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి : ప్రియుడితో పారిపోయేందుకు ప్లాన్​.. తనలా ఉన్న మరో అమ్మాయిని చంపి ఎస్కేప్​

27 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన హనుమంతుడు.. రూ.42 లక్షలు పూచికత్తుతో బయటకు

Last Updated : Mar 30, 2023, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.