ETV Bharat / bharat

'భయపడేది లేదు.. దాపరికాలూ లేవ్'.. అదానీ వివాదంపై అమిత్ షా - గౌతమ్ అదానీ అమిత్ షా

అదానీ- హిండెన్​బర్గ్ వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో భాజపా భయపడాల్సిందేమీ స్పష్టం చేశారు. ఇందులో దాపరికాలు లేవని అన్నారు. అయితే, అమిత్ షా ప్రకటనపై స్పందించిన కాంగ్రెస్.. జేపీసీ ఏర్పాటుకు ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించింది.

adani hindenburg issue Amit Shah
adani hindenburg issue Amit Shah
author img

By

Published : Feb 14, 2023, 1:04 PM IST

Updated : Feb 14, 2023, 2:11 PM IST

అదానీ గ్రూప్- హిండెన్​బర్గ్ వివాదంపై భాజపాకు ఎలాంటి భయాలు లేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇందులో భాజపా దాచిపెట్టడానికి ఏమీ లేదని అన్నారు. ఈ అంశంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మాట్లాడిన ఆయన.. ఈ విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తాను పెద్దగా మాట్లాడనని చెప్పారు. అదానీ గ్రూప్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్​సభలో చేసిన ప్రసంగంపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ హయాంలో రూ.12లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు.

"మా హయాంలో ఆశ్రిత పక్షపాతం అనే ప్రశ్నే లేదు. మాపై అలాంటి ఆరోపణలు ఎవరూ చేయలేరు. కాంగ్రెస్ పాలనలో కాగ్, సీబీఐ వంటి ఏజెన్సీలు స్వయంగా అవినీతిపై కేసులు నమోదు చేశాయి. అప్పుడు రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి. రాహుల్ గాంధీ లోక్​సభలో ఏం మాట్లాడతారనేది ఆయన ఇష్టం. సుప్రీంకోర్టు ఈ (అదానీ వ్యవహారం) విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విషయంపై ఓ మంత్రిగా మాట్లాడలేను. కానీ భాజపా ఈ విషయంలో దాచడానికి, భయపడటానికి ఏమీ లేదు."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

'కోర్టులపై మా ప్రభావం లేదు'
దేశంలోని వ్యవస్థలన్నింటినీ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నారని విపక్షాలు ఆరోపించడాన్ని అమిత్ షా ఖండించారు. కోర్టులపై భాజపా ప్రభావం ఏమీ లేదని స్పష్టం చేశారు. 'వారు (విపక్షాలు) కోర్టుకు ఎందుకు వెళ్లవు? పెగాసస్ వివాదం సమయంలోనూ నేను ఇదే చెప్పా. ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని సూచించా. కానీ సమస్యపై అనవసర రాద్ధాంతం చేయడమే వారికి తెలుసు. కోర్టుకు వెళ్లిన వారికి న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చింది' అని అన్నారు.

గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేయడంపై స్పందించిన అమిత్ షా.. ఇలాంటివి మోదీకి కొత్త కాదని అన్నారు. ప్రధాని మోదీపై 2002 నుంచి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. 'ప్రధాని మోదీపై 2002 నుంచి కుట్రలు జరుగుతున్నాయి. కానీ నిజం ఎప్పటికీ సూర్యుడిలా వెలుగుతుంది. వెయ్యి కుట్రలు పన్నినా.. నిజాన్ని దెబ్బతీయలేరు. తనపై ఎన్ని కుట్రలు పన్నినా మోదీ ఎప్పటికప్పుడు మరింత బలమైన నేతగా ఎదిగారు. ప్రజల్లో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు' అని అమిత్ షా పేర్కొన్నారు.

జేపీసీకి అనుమతించరేం: కాంగ్రెస్
అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. దాపరికాలు లేకపోతే అదానీ అంశంపై దర్యాప్తునకు ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించింది. జేపీసీ విషయం పార్లమెంట్​లో లేవనత్తడానికీ తమను అనుమతించడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. 'మా పార్టీ అధ్యక్షుడు ఖర్గే జేపీసీపై డిమాండ్ చేస్తే.. ఆ వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించారు. అదానీ వ్యవహారంపై దాచడానికి ఏమీ లేకపోతే జేపీసీకి అనుమతించండి. పెట్టుబడులకు మేం వ్యతిరేకం కాదు. ఆశ్రిత పక్షపాతాన్ని.. ప్రభుత్వ రంగ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరించడాన్నే మేం వ్యతిరేకిస్తున్నాం' అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.

ఆ కంపెనీతో అదానీ ఖాతాల ఆడిట్​
మరోవైపు, అకౌంటింగ్​లో అవకతవకలకు పాల్పడినట్లు హిండెన్​బర్గ్ ఆరోపించిన నేపథ్యంలో అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాల స్వతంత్ర ఆడిట్ కోసం గ్రాంట్ థోర్న్​టన్ అనే ​కంపెనీని నియమించుకుంది. నిబంధనలకు అనుగుణంగానే ఖాతాలు నిర్వహిస్తున్నట్లు ఆర్​బీఐ వంటి సంస్థల వద్ద నిరూపించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తీసుకున్న రుణాలు ఇతర అవసరాలకు వినియోగించడం, నిధుల మళ్లింపు వంటి లావాదేవీలపై ఆడిటింగ్​లో ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు చెప్పాయి.

హిండెన్​బర్గ్ వివాదం..
షేర్ల విలువలు పెంచడంలో అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన నివేదిక దేశంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై పార్లమెంట్ సమావేశాల్లోనూ విపక్షాలు ఆందోళన చేశాయి. ప్రభుత్వం పెట్టుబడిదారుల విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి అదానీ గ్రూప్​పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి.

Last Updated : Feb 14, 2023, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.