Accident in Vijayawada Bus Stand: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో బస్సు బీభత్సం సృష్టించింది. ఓ ఆర్టీసీ బస్సు ప్లాట్‌ఫాంలోని ప్రయాణికులపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బస్సు చక్రాల కిందపడి పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదం ప్రయాణికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. విజయవాడ ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు.. గుంటూరు వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఉన్నట్లుండి ప్లాట్‌ఫాంలోని ప్రయాణికులపై అతివేగంతో దూసుకొచ్చింది. ఈ క్రమంలో బస్సు చక్రాల కింద పడి ముగ్గురు బలయ్యారు. మృతుల్లో ఓ మహిళతో పాటు, ఆర్టీసీ బుకింగ్ క్లర్క్, ఆరు నెలల చిన్నారి ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
బ్రిడ్జ్ పైనుంచి రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు- నలుగురు మృతి
బస్సు ప్రమాదం ధాటికి ప్రాంగణంలోని బారికేడ్లు, కుర్చీలు ధ్వంసమయ్యాయి. దుకాణాల్లోకి కూడా దూసుకెళ్లడంతో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా మారింది. బ్రేక్ పడకపోవడం వల్లే బస్సు ఫ్లాట్ఫాంపైకి దూసుకొచ్చిందని దుకాణదారులు చెబుతున్నారు.
"బస్సు ఎక్సలేటర్ పట్టేసింది. దాంతో నేను రివర్స్ గేర్ వేశాను. బస్సు ముందుకు పోనిద్దామని మూవ్ చేశాను. అది పట్టుకునిపోవడం వల్ల నాకు ఏం అర్థం కాలేదు. బస్సుకు ఆ సమస్య ఎప్పటినుంచో ఉందంటా.. నేను నిన్న, ఈ రోజే వచ్చాను." -ప్రమాదానికి గురైన బస్ డ్రైవర్
రక్తపు మడుగులోనే 20 నిమిషాలు- రోడ్డు ప్రమాదంలో యువ డైరెక్టర్ మృతి
ఎక్సలేటర్ పట్టేసిందని అందువల్ల కదలకపోవడంతో.. రివర్స్ గేర్ వేశానని బస్సు డ్రైవర్ చెబుతున్నారు. తాను నిన్నటి నుంచి ఆ బస్సును డ్రైవ్ చేస్తున్నట్లు తెలిపారు. బస్సు ప్రమాదంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు.
ప్రమాదంపై సమాచారం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాద వివరాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది ఎంటీ అనే అంశలపై ప్రత్యక్షసాక్ష్యులను అడిగి తెలుకుంటున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఎదురుగా వస్తున్న వాహానాన్ని తప్పించబోయి, కాలువలోకి దూసుకెళ్లిన బస్సు! పల్నాడు జిల్లాలో ఘటన
School Bus Accident :స్కూల్ బస్ కాలువలో బోల్తా: కృష్ణా జిల్లాలో ఓ పాఠశాల బస్సు పంట కాలువలో బోల్తా పడింది. స్టీరింగ్ రాడ్ విరగడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు అంటున్నారు. జిల్లాలోని అవనిగడ్డలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు.. కోడూరు మండలం, విశ్వనాథపల్లె సమీపంలో అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని స్థానికులు అంటున్నారు.
Uttar Pradesh Road Accident : చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం