ETV Bharat / bharat

డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు దాచిన 'అవినీతి' అధికారి - కర్ణాటక వార్తలు

కర్ణాటకలో విస్తృత సోదాలు నిర్వహించిన ఏసీబీ సిబ్బంది ఓ అవినీతి అధికారి ఇంటి డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు గుర్తించారు. ప్లంబర్​ను పిలిపించి పైపు కత్తిరించి వాటిని వెలికి తీశారు. ఆ అధికారి ఇంట్లో 7.5కేజీల బంగారాన్ని కూడా సీజ్ చేశారు(ACB Raid in Karnataka).

ACB Raid in Karnataka
డ్రైనేజీ పైపు నుంచి నోట్ల కట్టలు బయటకు తీసిన ఏసీబీ అధికారి
author img

By

Published : Nov 24, 2021, 4:35 PM IST

Updated : Nov 24, 2021, 9:49 PM IST

డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు దాచిన 'అవినీతి' అధికారి

కర్ణాటకలో అవినీతి ప్రభుత్వ ఉద్యోగులకు షాకిస్తూ అనూహ్య దాడులు చేశారు ఏసీబీ అధికారులు. ఒకేసారి 60 చోట్ల విస్తృత సోదాలు నిర్వహించారు. భారీ మొత్తంలో అక్రమ బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు(ACB Raid in Karnataka).

ACB Raid in Karnataka
డ్రైనేజీ పైపు నుంచి డబ్బు తీస్తున్న ఏసీబీ అధికారి

సోదాల్లో భాగంగా కలబురగి పీడబ్ల్యూడీ జేఈ శాంతగౌడ ఇంట్లో తనిఖీ కోసం వెళ్లారు ఏసీబీ సిబ్బంది. అతని ఇంటి డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు ఉన్నట్లు గుర్తించారు. ప్లంబర్​ను పిలిపించి పైపు కట్​ చేసి వాటిని బయటకు తీశారు. ఏసీబీ అధికారులను చూసి శాంతగౌడ తలుపులు 10 నిమిషాల పాటు తెరవలేదు(karnataka acb raid news). ఆ సమయంలోనే అతను డబ్బును డ్రైనేజీ పైపులో వేసి ఉంటాడని అధికారులు చెప్పారు. ఈ విషయం తెలిసే తాము పైపు కత్తిరించినట్లు వివరించారు. డ్రైనేజీ పైపు నుంచి రూ.13 లక్షలు వెలికితీసినట్లు వెల్లడించారు. శాంతగౌడ ఇంట్లో మొత్తం రూ.54లక్షల అక్రమ నగదు, బంగారు ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. రెండు లాకర్ల తాళంచెవులు ఇవ్వకుండా అధికారులను శాంతగౌడ ఇబ్బందిపెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి(karnataka acb raids).

ACB Raid in Karnataka
సోదాల్లో దొరికిన డబ్బు, బంగారం

కర్ణాటకలో 15 మంది ప్రభుత్వ అధికారులకు సంబంధించి మొత్తం 60 చోట్ల ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం ముమ్మర తనిఖీలు చేశారు. గడగ్​ జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్​ టీఎస్ రుద్రేషప్పకు చెందిన శివమొగ్గ నివాసంలో రూ.3.5కోట్లు విలువ చేసే 7.5 కేజీల బంగారం సీజ్ చేశారు. రూ.15లక్షల నదగు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంట్లో చేసిన సోదాల్లో 100 గ్రాముల గోల్డ్ బిస్కట్లు 60, 50 గ్రాములవి 8, కిలోన్నర ఆభరణాలు, డైమండ్ నెక్లెస్​, 3 కేజీల వెండిని అధికారులు గుర్తించారు(acb raid in karnataka today).

ఇదీ చదవండి: కర్ణాటకలో ఏసీబీ సోదాలు- ఏకకాలంలో 60 చోట్ల తనిఖీలు

వారికి కేంద్రం గుడ్​న్యూస్​- మార్చి వరకు రేషన్​ ఫ్రీ!

Last Updated : Nov 24, 2021, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.