బంగాల్లోని కోల్‌కతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ ఆసుపత్రిలో ఓ రోగి హల్చల్ చేశాడు. ఎనిమిదో అంతస్తు పిట్టగోడ అంచున కూర్చొని రెండు గంటలకుపైగా హడావుడి చేశాడు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అతడు కింద పడి మరణించాడు. అయితే అతడు కింద పడతాడని ముందే ఊహించిన అధికారులు, ఆస్పత్రి సిబ్బంది.. భవనం బయట నెట్ అమర్చారు. కానీ అతడు మాత్రం నేలపై పడి తీవ్రంగా గాయాలపాలై మృతి చెందాడు.
అంతకుముందు.. విచిత్రంగా ప్రవర్తిస్తున్న ఈ రోగిని గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనతో అతడిని చేరుకోవడానికి ప్రయత్నించారు. అయినా అతడు కిందకు దిగడానికి నిరాకరించాడు. అక్కడే ఉంటానని చెప్పాడు. దగ్గరికి వస్తే దూకేస్తానంటూ వీరంగం సృష్టించాడు. ఈ ఘటన వల్ల ఆసుపత్రి రహదారిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ఇవీ చదవండి: మొండెం లేని యువకుడి మృతదేహం లభ్యం.. హత్యనా? లేక ఇంకేమైనా?
స్వీపర్‌కు హ్యాట్సాఫ్.. దొరికిన వజ్రాలను యజమానికి అందజేత.. వాటి విలువ ఎంతంటే?