ETV Bharat / bharat

కారు- డంపర్​ ఢీ.. గుమిగూడిన ప్రజలపైకి దూసుకెళ్లిన 'జాగ్వార్​'.. 9మంది మృతి

gujarat road accident today
gujarat road accident today
author img

By

Published : Jul 20, 2023, 7:14 AM IST

Updated : Jul 20, 2023, 9:35 AM IST

07:04 July 20

రెండు కార్లు ఢీ.. ప్రజలపైకి దూసుకెళ్లిన మరో వాహనం.. 9మంది మృతి

కారు- డంపర్​ ఢీ.. గుమిగూడిన ప్రజలపైకి దూసుకెళ్లిన 'జాగ్వార్​'

Gujarat Road Accident Today : గుజరాత్​.. అహ్మదాబాద్​లోని ఇస్కాన్​ వంతెనపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 15 మంది గాయపడ్డారు. మృతుల్లో కానిస్టేబుల్​, హోంగార్డు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని సోలా సివిల్​ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి ఎస్​జీ హైవేపై ఈ ఘటన జరిగింది. తొలుత.. మహీంద్రా థార్​ వాహనం, డంపర్‌ ఢీకొన్నాయి. ఆ ప్రమాదాన్ని చూసేందుకు అక్కడ దాదాపు 40 నుంచి 50 మంది ప్రజలు దాకా గుమిగూడారు. ఈ క్రమంలో కర్ణావతి క్లబ్​ నుంచి దాదాపు గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకువచ్చిన జాగ్వార్ కారు.. వారిపైకి దూసుకెళ్లింది. దీంతో కొంతమంది దాదాపు 25 నుంచి 30 అడుగుల దూరంలోకి ఎగిరిపడ్డారు. ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో విధుల్లో భాగంగా అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్, హోంగార్డు​ కూడా ఉన్నారు. మృతులను అక్షయ్ చావ్డా (బొటాడ్), కృనాల్ కొడియా (బొటాడ్), అమన్ కచ్చి (సురేంద్రనగర్), అర్మాన్ వడ్వానియా (సురేంద్రనగర్), నీరవ్ (అమ్డా), ధర్మేంద్ర సింగ్ (అహ్మదాబాద్- పోలీస్ కానిస్టేబుల్)గా గుర్తించారు.

ప్రమాదానికి కారణమైన జాగ్వార్ కారు డ్రైవర్ సహా 15 మందిని సోలా సివిల్ ఆసుపత్రికి తరలించారు. జాగ్వార్ కారులో ఓ బాలిక సహా నలుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఇందులో మిజన్ షేక్, నారన్ గుర్జర్‌లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న సెక్టార్-1 జేసీపీ నీరజ్‌కుమార్ బద్గుజార్.. సీనియర్ అధికారులతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం తరలించి ట్రాఫిక్‌ను మళ్లించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ట్రాఫిక్​ ఏసీపీ ఎస్​జే మోదీ తెలిపారు. 12 మందిని ఆస్పత్రికి తరలించగా అందులో 9 మంది చనిపోయారని.. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సోలా సివిల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ కృపా పటేల్ తెలిపారు.

సీఎం సంతాపం.. రూ.4లక్షల ఎక్స్​​గ్రేషియా..
ఈ ఘోర ప్రమాదంపై గుజరాత్​ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. ఇస్కాన్ బ్రిడ్జి వద్ద బుధవారం రాత్రి జరిగిన ప్రమాదం చాలా బాధాకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్​గ్రేషియా రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందించనుందని ట్వీట్ చేశారు.

Last Updated : Jul 20, 2023, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.