ETV Bharat / bharat

7th Pay Commission Report 2023 : ఉద్యోగులకు డీఏ.. పెరిగేది ఎంత..? అమలు ఎప్పట్నుంచి..?

DA For Central Govt Employees : దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నాయి. ఇటీవల పెరిగిన టమాటా ధరలే ఇందుకు సాక్ష్యం. కేవలం కూరగాయలే కాకుండా.. అన్ని రకాల సరుకులు, ఇతర వస్తువుల ధరలు కూడా అందుకోలేనంతగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ (DA) పింఛన్ దారులకు డియర్​ నెస్ రిలీప్ (DR) పెంచాలని భావిస్తోంది.

DA For Central Govt Employees
7th Pay Commission Report 2023
author img

By

Published : Aug 18, 2023, 10:04 AM IST

Updated : Aug 18, 2023, 10:38 AM IST

7th Pay Commission Report : ప్రభుత్వం.. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ (డియర్​నెస్ రిలీఫ్) ఇస్తుంది. ఇవి రెండూ సంవత్సరానికి రెండుసార్లు పెరుగుతాయి. క్యాలండర్ ఇయర్లో.. ప్రతీ సంవత్సరం జనవరిలో మొదటిసారి, జూలైలో రెండోసారి DA, DR పెరుగుతాయి. ఈ ఏడాది జనవరిలో జరగాల్సిన పెంపును ఆలస్యంగా మార్చిలో అమలు చేశారు. 4 శాతం పెంచడంతో 38 నుంచి 42 శాతానికి పెరిగింది. అయితే.. జూలైలో చేపట్టాల్సిన పెంపు మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే కేంద్ర కెబినెట్ ఆమోద ముద్రవేయనుంది.

డీఏ ఎంత పెరుగనుంది..?

DA How Much For Central Govt Employees :

అయితే.. DA ఇంకా DR ఎంత పెరుగుతుంది అనే విషయంలో ఉద్యోగులు ఉత్కంఠగా ఉన్నారు. ఈ సారి కూడా నాలుగు శాతం పైన పెరుగుతుందని, పెరగాలని ఆశిస్తున్నప్పటికీ.. 3 శాతానికి మాత్రమే పరిమితం అవుతుందని తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. తాము నాలుగు శాతం డిమాండ్ చేస్తున్నామని.. కానీ పరిస్థితుల ప్రభావం కారణంగా 3 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

Telangana government employees : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో శుభవార్త.. ఆలవెన్స్‌ పెంపు

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం.. ఈ డీఏ పెంపు ప్రతిపాదనను రూపొందిస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న తీరు.. ధరలు ప్రజలపై పడుతున్న ప్రభావం వంటివి లెక్కలోకి తీసుకొని.. ఎంత పెంచితే బాగుంటుందన్న దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ఫైనల్ చేసిన తర్వాత.. ఆ నివేదికను కేంద్ర మంత్రివర్గానికి అందజేస్తుంది. ఆ ప్రతిపాదనను సెంట్రల్ కేబినెట్ పరిశీలించి.. ఎంత పెంచాలనే విషయమై తుది నిర్ణయం తీసుకుంటుంది.

3 నుంచి 4 శాతం డీఏ..?

DA 3 to 4 Percent For Central Govt Employees :

ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. 3 నుంచి 4 శాతం మధ్యలో డీఏ ఫైనల్ అయ్యే అవకాశం ఉందన్నది మెజారిటీ అభిప్రాయం. దీనికి సంబంధించి కేంద్రం అతి త్వరలో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని సమాచారం. ఈ డీఏ, డీఆర్​ను జూలై 1నుంచి లెక్కించి అందజేస్తారు. డీఏ, డీఆర్ పెరుగుదల ద్వారా.. 47.58 లక్షల మంది ఉద్యోగులు, 69.76 లక్షల మంది పింఛన్​దారులు లబ్ధి పొందుతారు.

మహిళా ఉద్యోగులకు సర్కార్​ గుడ్​న్యూస్.. ఏడాదికి 7 సెలవులు ఎక్స్​ట్రా!

డీఏ విడుదల చేసిన పలు రాష్ట్రాలు :

States DA For Employees :

కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నాయి. కర్ణాటక, ఒడిషా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించాయి. (7th Pay Commissions News Latest) మిగిలిన రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగులకు డీఏ, డీఆర్ పెంచేందుకు చూస్తున్నాయి. హద్దు లేకుండా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు.. జనాన్ని తీవ్ర కష్టాల పాల్జేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వాలు డీఏ పెంచితే ఊరట లభిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని కోరుతున్నారు.

Employees Attending Duties Wearing Helmets : ఆఫీసులోనూ హెల్మెట్‌.. ధరించకపోతే ప్రాణాలకు లేదు గ్యారంటీ!

మీ జీతం పెరిగిందా?.. ఖర్చులను తగ్గించి ఇన్వెస్ట్​ చేసుకోండిలా!

Last Updated : Aug 18, 2023, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.