తమిళనాడు నీలగిరి జిల్లాలో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పులికోసం వేట ప్రారంభమైంది. 20 మంది సభ్యులతో కూడిన 5 బృందాలు మన్సినకుడి గ్రామంలో ఆపరేషన్ మొదలుపెట్టాయి. నీలగిరి జిల్లాలో ఇప్పటివరకు పులిదాడిలో (Nilgiri Tiger Attack) నలుగురు చనిపోయారు. తాజాగా ముదుమలై పులి సంరక్షణ ప్రాంతం పరిధిలోని మన్సినగుడి గ్రామానికి చెందిన 85ఏళ్ల గొర్రెల కాపరి కూడా పులిదాడిలో చనిపోయాడు.

తమ ప్రాణాలకు ముప్పుగా మారిన పులిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ.. గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి దాదాపు 3 గంటలకుపైగా రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో స్పందించిన అటవీశాఖ ఉన్నతాధికారులు పులిని వేటాడేందుకు 5 బృందాలను రంగంలో దించారు.
ఇదీ చూడండి: 'మీ నాన్న దగ్గరకు తీసుకెళ్తా'... ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య