ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రదాడి.. ఇద్దరు యూపీ కూలీలు మృతి.. హైబ్రిడ్ ముష్కరుడు అరెస్ట్ - షోపియాన్ హైబ్రిడ్ ఉగ్రదాడి

జమ్ము కశ్మీర్​లో హైబ్రిడ్ ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యూపీ కూలీలు మరణించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.

grenade attack in JK Shopian
grenade attack in JK Shopian
author img

By

Published : Oct 18, 2022, 8:08 AM IST

Updated : Oct 18, 2022, 2:21 PM IST

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానికేతరులే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రెనేడ్ దాడిలో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. షోపియాన్ జిల్లాలోని హర్మేన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతులను మనీశ్ కుమార్, రామ్ సాగర్​లుగా గుర్తించారు. వీరిద్దరూ ఉత్తర్​ప్రదేశ్​లోని కన్నౌజ్ ప్రాంతానికి చెందినవారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. క్షణాల్లో ఆ ప్రాంతానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలోనే గ్రెనేడ్ విసిరిన ఉగ్రవాదిని అరెస్టు చేశారు. నిందితుడిని ఇమ్రాన్ బషీర్ గనీగా గుర్తించారు. అతడు హర్మేన్​లోనే నివసిస్తున్నాడని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. లష్కరే తొయిబాకు చెందిన హైబ్రిడ్ ఉగ్రవాది అని చెప్పారు. దీనిపై వేగంగా విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.

Last Updated : Oct 18, 2022, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.