ETV Bharat / bharat

భారీ కుట్ర భగ్నం.. 2 కిలోల యురేనియంతో చిక్కిన స్మగ్లర్లు.. 15 మంది అరెస్ట్​

Uranium Smuggling India: ప్రమాదకర యురేనియంను భారత్​లోకి స్మగ్లింగ్​ చేస్తున్న ముఠాను ఇండో-నేపాల్​ సరిహద్దు వద్ద అడ్డుకున్నారు పోలీసులు. 2 కేజీల యురేనియం సహా ఇతర అనుమానస్పద వస్తువులు లభ్యమయ్యాయి. మొత్తం 15 మందిని అరెస్టు చేశారు పోలీసులు.

Huge haul of Uranium on Indo-Nepal border; police arrest 15 smugglers

author img

By

Published : Jul 22, 2022, 10:44 AM IST

Updated : Jul 22, 2022, 11:25 AM IST

Uranium Smuggling India: ఇండో-నేపాల్​ సరిహద్దులో భారీ కుట్ర భగ్నం చేశారు పోలీసులు. భారత్​లోకి 2 కిలోల యురేనియంను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మొత్తం 15 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. యురేనియం ఎక్కడినుంచి వచ్చింది అనేది ఆరా తీస్తున్నారు.
నేపాల్​ కాఠ్​మాండూ మీదుగా భారత్​లోని బిహార్​కు పేలుడు పదార్థాల్లో ఉపయోగించే ప్రమాదకర యురేనియంను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సరిహద్దులోని బిరాట్​​నగర్​ వద్ద తనిఖీలు నిర్వహించగా.. నిందితులు పట్టుబడ్డారు. యురేనియంతో పాటు మరికొన్ని అనుమానస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. బిహార్​లోని అరారియా, జోగ్​బానీ నుంచి స్మగ్లింగ్​కు యత్నించినట్లు తెలుస్తోంది.

స్మగ్లర్మ అరెస్టు అనంతరం.. భారత భద్రత సంస్థలు, సశస్త్ర సీమా బల్​(ఎస్​ఎస్​బీ) అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో భద్రతా చర్యలను మరింత పెంచాయి. యురేనియం విలువ రూ. కోట్లలో ఉంటుంది. దీనిని అణ్వాయుధ తయారీలోనూ ఉపయోగిస్తారు. ఒక కేజీ యురేనియం 24 మెగావాట్ల శక్తికి సమానం. దీంతో విధ్వంసమే సృష్టించే అవకాశముంది. భద్రతా దళాల అప్రమత్తంతో.. పెను ప్రమాదం తప్పింది.

ఇవీ చూడండి: 'సారే జహాసె అచ్ఛా' రచయితే.. భారతదేశ విభజనకు రూపకర్త!

రూ.600 కోట్ల యావదాస్తి ప్రభుత్వానికి విరాళం.. ఒక్క ఇల్లు తప్ప!

Last Updated : Jul 22, 2022, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.