ETV Bharat / bharat

మిజోరంలో 128 మంది చిన్నారులకు కరోనా.. కేరళలో..

కరోనా పిల్లలపై విరుచుకుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మిజోరంలో 576 కొత్త కేసులు నమోదవగా.. అందులో 126 మంది చిన్నారులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కేరళలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. కొత్తగా ఆ రాష్ట్రంలో 21వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి.

corona in children
పిల్లల్లో కరోనా
author img

By

Published : Aug 12, 2021, 8:05 PM IST

Updated : Aug 12, 2021, 10:23 PM IST

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల ఈ మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ గురువారం 41 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. అయితే, మిజోరంలో 576 కొత్త కేసులు నమోదు కాగా.. వీరిలో 128మంది చిన్నారుల్లోనే ఈ వైరస్‌ వెలుగుచూడటం గమనార్హం.

కొత్త కేసులతో కలిపి మిజోరంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 46,896కి పెరిగింది. అలాగే, కొత్తగా మరో ఇద్దరు కొవిడ్‌తో మృతిచెందగా.. మృతుల సంఖ్య 173కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క ఐజ్వాల్‌ జిల్లాలోనే అత్యధికంగా 323 కేసులు వచ్చాయి. తాజాగా ఈ మహమ్మారి బారిన పడినవారిలో చిన్నారులతో పాటు ఎనిమిది మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం మిజోరంలో 11,989 యాక్టివ్‌ కేసులు ఉండగా.. రికవరీ రేటు 74శాతంగా ఉంది. ఇప్పటివరకు 6.24లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసుకోగా.. వీరిలో 2.13 లక్షల మందికి రెండు డోసులూ అందింది.

కేరళలో కలకలం..

మరోవైపు.. కేరళలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 21,445 కేసులు నమోదయ్యాయి. మరో 20,723 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 160 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 36.31 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 18,280 మంది వైరస్​ బారిన పడి మృతిచెందారు.

  • మహారాష్ట్రలో కొత్తగా 6,388 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 208 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తమిళనాడులో 1,942 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 28 మంది బలయ్యారు.
  • కర్ణాటకలో ఒక్కరోజే 1,857 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 30 మంది వైరస్​ కారణంగా మృతి చెందారు.
  • మణిపుర్​లో కొత్తగా 677 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 12 మంది మరణించారు.
  • మధ్యప్రదేశ్​లో 131 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి కొత్తగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 43 మందికి కరోనా సోకినట్లు తేలింది. కొవిడ్​ కారణంగా నలుగురు మరణించారు.
  • రాజస్థాన్​లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇవీ చూడండి:

Last Updated : Aug 12, 2021, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.