ETV Bharat / bharat

కొవిడ్ కలవరం.. భారత్​కు వచ్చిన ఆ ప్రయాణికుల్లో 11 రకాల వేరియంట్లు - కరోనా వార్తలు

భారత్​కు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడ్డట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇవన్నీ ఒమిక్రాన్ సబ్ వేరియంట్​ కేసులేనని తెలిపింది.

covid-variants in passengers
covid-variants in passengers
author img

By

Published : Jan 5, 2023, 1:59 PM IST

Updated : Jan 5, 2023, 2:18 PM IST

అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహిస్తున్న కరోనా టెస్టుల్లో వివిధ వేరియంట్ల కేసులు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. డిసెంబర్ 24 నుంచి జనవరి 3 మధ్య ప్రయాణికులకు చేసిన కరోనా టెస్టుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడ్డాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇవన్నీ ఒమిక్రాన్ సబ్​వేరియంట్లేనని స్పష్టం చేశాయి. ఇందులో కొత్త వేరియంట్లేవీ లేవని.. ఇవన్నీ గతంలో దేశంలో నమోదైనవేనని పేర్కొన్నాయి. ఎయిర్​పోర్టులు, సముద్ర పోర్టులు, సరిహద్దులలో ఉండే ల్యాండ్​పోర్టులలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించాయి.

మొత్తం 19,227 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీరిలో 124 మందికి మాత్రమే కొవిడ్ పాజిటివ్​గా తేలిందని వెల్లడించాయి. 124 మందిలో 40 మంది నమూనాల జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇందులో 14 నమూనాల్లో.. ఎక్​బీబీ, ఎక్స్​బీబీ.1 వేరియంట్ ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. ఒక శాంపిల్​లో బీఎఫ్ 7.4.1 వేరియంట్ గుర్తించినట్లు తెలిపారు.

కొవిడ్‌ కేసుల సంఖ్య కొన్ని దేశాల్లో పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రతి విమానంలో 2శాతం మంది ప్రయాణికులకు విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఇటీవలే నిర్ణయించింది. ప్రయాణికుల్లో పరీక్షలు ఎవరికి నిర్వహించాలన్నది సంబంధిత విమానయాన సంస్థలు గుర్తిస్తాయని కేంద్రం తెలిపింది. వేర్వేరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఎంపిక చేసిన ప్రయాణికుల నుంచి నమూనాలు తీసుకొని ఇంటికి పంపించేస్తారు. ఎవరికైనా పాజిటివ్‌ వస్తే ఆ నివేదికను ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌కు, విమానాశ్రయ ఆరోగ్య అధికారికి, సంబంధిత రాష్ట్రానికి పంపుతారు. పాజిటివ్‌ నమూనాలను జన్యు పరిణామక్రమ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్‌ ప్రయోగశాలలకూ పంపిస్తారు. పరీక్షలకు అయ్యే ఖర్చులను కేంద్ర వైద్యఆరోగ్యశాఖ చెల్లిస్తుంది.

Last Updated : Jan 5, 2023, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.