కొవిడ్ వ్యాక్సినేషన్‌ను విస్తృతం చేసేందుకు ప్రభుత్వాలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా (Madhya Pradesh Vaccination) పలు చోట్ల ప్రజలు టీకా తీసుకునేందుకు ఇంకా ఆసక్తి చూపడం లేదు. చాలామంది ఒక డోసు టీకాకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో రెండో డోసు తీసుకున్న వారికి మద్యం సీసాలపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తామంటూ ఆఫర్ చేస్తున్నారు (Madhya Pradesh Vaccination) మధ్యప్రదేశ్ మందసుర్ జిల్లా అధికారులు.
నేడు (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం భారీ ఎత్తున (Madhya Pradesh Vaccination) టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. ఈ సందర్భంగా ఎక్కువమంది రెండో డోసు తీసుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. తాము ప్రకటించిన ఆఫర్‌కు మంచి స్పందన లభిస్తే భవిష్యత్తులో రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా దీనిని అమలు చేస్తామని మందసుర్ జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ అనిల్ సచిన్ వెల్లడించారు.
ఇది కరెక్ట్ కాదు..
అధికారుల ప్రతిపాదనను మందసుర్ భాజపా ఎమ్మెల్యే యశ్పాల్ సింగ్ తప్పుపట్టారు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని.. దీని వల్ల మద్యం వినియోగాన్ని మరింత ప్రోత్సహించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి : cryptocurrency bill: శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లు