ETV Bharat / bharat

మూడు ట్రక్కులు- కారు ఢీ.. ఎగసిపడ్డ మంటలు.. ఆరుగురు దుర్మరణం - మినీ గూడ్స్ వాహనం ట్రక్కు ఢీ

Road Accident News: మూడు ట్రక్కులు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం గుజరాత్​లో జరిగింది. ఉత్తరప్రదేశ్​లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో పెళ్లిబృందానికి చెందిన నలుగురు ఘటనాస్థలిలోనే మరణించారు.

మూడు ట్రక్కులు, ఓ కారు ఢీ
మూడు ట్రక్కులు, ఓ కారు ఢీ
author img

By

Published : May 21, 2022, 3:46 PM IST

Updated : May 21, 2022, 4:31 PM IST

మూడు ట్రక్కులు- కారు ఢీ.. ఎగసిపడ్డ మంటలు.. ఆరుగురు దుర్మరణం

Road Accident Gujarat: గుజరాత్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరవళ్లీ జిల్లా మోడాసా తాలూకా కోలిఖర్, అలంపుర్ గ్రామాల మధ్య మూడు ట్రక్కులు, ఓ కారు ఢీకొట్టుకున్న ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఓ ట్రక్కులో రసాయనాలు ఉండడం వల్ల పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. శనివారం ఉదయం 9.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న మోడాసా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

కారు-ట్రాక్టర్​ ఢీ.. ఉత్తర్​ప్రదేశ్​లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్​యూవీ కారు, ట్రాక్టర్​ ఎదురెదురుగా ఢీకొట్టుకున్న ఘటనలో పెళ్లిబృందానికి చెందిన ఆరుగురు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. గసాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మణ్‌పుర్​ నుంచి భగవాన్‌పుర్‌కు వెళ్తుండగా శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను బసంత్ (32), అమృత (28), లక్ష్మణ్ (40), వాడి (35), షాదాబ్ (26), అంకిత్ (13)గా పోలీసులు గుర్తించారు.

మినీ గూడ్స్ వాహనం- ట్రక్కు ఢీ.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్​ జిల్లాలో ఓ మినీ గూడ్స్ వాహనం ట్రక్కును ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. తఖత్‌పూర్ నుంచి జర్హగావ్ గ్రామానికి వెళ్తుండగా బిలాస్‌పుర్-ముంగేలి రహదారిపై శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గూడ్స్ వాహనంలోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన తెలిపారు. మృతులను భునేశ్వర్ సాహు (36), ఓంప్రకాష్ వర్మ (22), రఘువీర్ సాహు (24), మహేష్ సాహు (40)గా గుర్తించామన్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని, ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేసేందుకు గాలిస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి: 'భారత- చైనా సరిహద్దుల్లో ఉక్రెయిన్​ లాంటి పరిస్థితులు'

అసోం గోస: నీటమునిగిన ఇళ్లు.. రైల్వే ట్రాక్​లే నివాసాలు.. రోజుకు ఒక్కపూటే భోజనం

Last Updated : May 21, 2022, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.