ETV Bharat / snippets

నంద్యాల జిల్లాలో ఘోరం- ఆర్థిక సమస్యలతో దంపతుల ఆత్మహత్య

wife-and_husband_suicide_in_nandyal_district
wife-and_husband_suicide_in_nandyal_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 12:47 PM IST

Wife And Husband Suicide in Nandyal District : నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యలపై కుమారుడు, తల్లిదండ్రుల మధ్య వాగ్వాదమే దీనికి కారణమని స్థానికులు తెలుపుతున్నారు. పురుగుల మందు తాగిన సుంకన్న(59), లక్మిదేవి(44)ను కర్నూలులోని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ వారిద్దరు మృతి చెందారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. దంపతుల మృతదేహాలను చూసి గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజలు అన్ని సమస్యలకు ఆత్యహత్యే శరణ్యం అనుకోవడం దారుణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.