ETV Bharat / snippets

'హరితహారం' పేరు మార్చిన సర్కార్​ - ఇకపై ఏమని పిలవాలంటే?

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 8:59 AM IST

HARITHA HARAM SCHEME IN TELANGANA
Vana Mahotsavam in Telangana (ETV Bharat)

Harithaharam as Vana Mahotsavam : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన 'హరితహారం' కార్యక్రమాన్ని 'వన మహోత్సవం' పేరుతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు వన మహోత్సవం పేరుతోనే పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమం 1950లో ప్రారంభమైంది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ‘వజ్రోత్సవ వన మహోత్సవం’గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. మొక్కలు నాటేందుకు, సంరక్షణకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్​ సర్కార్​ ఆదేశాలు జారీ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.