ETV Bharat / snippets

షాద్​నగర్​లో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య - మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్​లో చుట్టి!

author img

By ETV Bharat Telangana Team

Published : 8 hours ago

Unknown Woman Brutally Murder
Unknown Woman Brutally Murder (ETV Bharat)

Unknown Woman Brutally Murder : రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ పట్టణం ఫరూక్​నగర్​లోని శ్రీనివాస కాలనీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కాలనీవాసులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. షాద్​ నగర్​ కోర్టు సమీపంలో ఇళ్ల మధ్యలో ప్లాస్టిక్​ కవర్​, దుప్పటిలో చుట్టిన మహిళ శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పడేసినట్లు గుర్తించారు. క్లూస్​ టీంకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. ఆమె వయసు సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడో చంపేసి, ఇక్కడ తెచ్చి పడేసినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. మహిళ శరీరంపై పసుపు రంగు దుస్తులు ఉన్నాయి. మహిళ రెండు చెవులు కత్తిరించి, చెవి కొమ్ములు తీసేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.