Two Students Died in Prakasam District: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈత కోసం వెళ్లిన ఇద్దరు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లా పామూరులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. డీవీపాలెంకు చెందిన గౌతమ్, చరణ్ అనే ఇద్దరు విద్యార్థులు పాఠశాలకు రెండు రోజులు సెలవులు రావడంతో గ్రామ సమీపంలో ఉన్న వాగులో ఈత కొట్టేందుకు వెళ్లారు. వాగులో అక్రమార్కులు ఇసుక, మట్టి కోసం గత కొంతకాలంగా భారీ జేసీబీలను ఉపయోగించి గోతులు తీశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గోతులు నీటితో నిండాయి. ఇది గమనించని విద్యార్థులు ఈత కొట్టేందుకై వాగులో దిగగా, లోతు ఎక్కువగా ఉండటం చేత నీటిలో మునిగి మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గజ ఈతగాళ్లను పిలిపించి వాగులో గాలింపు చేపట్టి మృతదేహాలను బయటకు తీయించారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇసుక కోసం గోతులు - ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 10, 2024, 5:02 PM IST