Vegetables Price Today : హైదరాబాద్‌లో కూరగాయలు, మాంసాహార ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఏది కొనాలన్నా ఓసారి ఆలోచించక తప్పట్లేదు. ఎర్రగడ్డలో నేటి కూరగాయల ధరలు (కిలో) ఇలా ఉన్నాయి. టమాట రూ.48, నల్ల వంకాయ 25, పొడుగు వంకాయ రూ.25, బెండకాయ రూ.40, పచ్చిమిర్చి రూ.65, బజ్జి మిర్చి రూ.60, క్యాప్సికం రూ.70, పచ్చి కాకరకాయ రూ.40, పందిరి బీర రూ.40, క్యాబేజీ రూ.20, క్యారెట్ రూ.40, దొండకాయ రూ.20, గుండు బీన్స్ రూ.118, గింజ చిక్కుడు రూ.65, గోకరకాయ రూ.48, కీర రూ.28, దోస రూ.30గా ఉన్నాయి.
వీటితో పాటు చికెన్ ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఫామ్ రేటు కిలోకు రూ.147గా ఉండగా, రిటైల్‌గా రూ.169 పలుకుతోంది. డ్రెస్డ్ చికెన్ రూ.245గా ఉండగా, స్కిన్లెస్ చికెన్ రూ.280గా ఉంది.