ETV Bharat / snippets

రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

8 IAS Officers Transfers in Telangana State Today
IAS Officers Transfer in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 6:39 PM IST

IAS Officers Transfer in Telangana : రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్​లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి బదిలీ అయ్యారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ కమిషనర్​గా శ్రీదేవిని బదిలీ చేసిన ప్రభుత్వం, వాణిజ్య పన్నుల కమిషనర్​గా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్​రెడ్డి మార్క్ ఫెడ్ ఎండీగా బదిలీ అయ్యారు. ట్రాన్స్​పోర్ట్​, హౌజింగ్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్​రాజ్ పోస్టును రవాణా, ఆర్అండ్​బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మార్చింది.

విపత్తుల నిర్వహణ విభాగం జాయింట్ సెక్రటరీగా ఎస్.హరీశ్​ను నియమించిన ప్రభుత్వం రవాణా, ఆర్అండ్​బీ శాఖల అదనపు బాధ్యతలను కేటాయించింది. మార్కెటింగ్​శాఖ డైరెక్టర్​గా పీ.ఉదయ్ కుమార్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉపకార్యదర్శిగా సీహెచ్.ప్రియాంక నియమితులయ్యారు. హాకా మేనేజింగ్ డైరెక్టర్​గా కె.చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.