ETV Bharat / snippets

'పోలీసులు మీకు ఫోన్ చేయరు - కాల్ చేస్తోంది మేం కాదు కేటుగాళ్లు' - సైబర్ నేరాలపై డీజీపీ

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 12:47 PM IST

DGP Tweet On Cyber Fraud
DGP Tweet On Cyber Fraud (ETV Bharat)

DGP Jithender Tweet On Cyber Frauds : సైబర్​ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా పోలీస్​ అధికారి డీపీతో ఉన్న నెంబర్​తో వాట్సాప్​ కాల్ చేసి బెదిరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ సంబంధిత వీడియోను ఎక్స్​లో రాష్ట్ర డీజీపీ జితేందర్​ పోస్ట్ చేశారు. 'సైబర్​ నేరగాళ్లు పోలీస్​లా మాట్లాడుతూ మీ కుటుంబ సభ్యులు కేసుల్లో ఇరుక్కున్నారని చెబుతారు. డబ్బు పంపిస్తే సెటిల్​ చేసుకోవచ్చు ఎలాంటి ఎఫ్ఐఆర్​ నమోదు కాదని సైబర్​ కేటుగాళ్లు నమ్మిస్తారు" అలాంటి వాటిని నమ్మకూడదని డీజీపీ సూచించారు. పొరపాటున సైబర్​ నేరానికి గురైతే వెంటనే 1930 కి కాల్​ చేయాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.