ETV Bharat / snippets

దసరా నుంచి స్కిల్​ యూనివర్సిటీలో శిక్షణ ప్రారంభం

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 5:36 PM IST

CS Shanti Kumari Review on Skill University
CS Shanti Kumari Review on Skill University (ETV Bharat)

CS Shanti Kumari Review on Skill University : 'యంగ్ ఇండియా' స్కిల్ యూనివర్సిటీలో దసరా నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. దాదాపు 20 కోర్సులను నిర్వహించాలని గుర్తించినట్లు ఆమె తెలిపారు. ప్రాథమికంగా ఆరు కోర్సులను దసరా నుంచి ప్రారంభించినట్లు నిర్ణయించారు. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారని, ఈ నిర్మాణ పనులు ముగిసేంతవరకు యూనివర్సిటీని తాత్కాలిక భవనంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకు గాను, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా గానీ, నాక్ లేదా నిథమ్​లో నిర్వహించనున్నట్టు చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్ విశ్వవిద్యాలయంలో దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.