ETV Bharat / snippets

ఈనెల 16 న దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి - ఆ అంశాలపై చర్చించేందుకే?

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 6:16 PM IST

CM REVANTH REDDY DELHI TOUR
CM REVANTH REDDY DELHI TOUR (ETV Bharat)

CM Revanth Delhi Tour On September 16th : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఈ నెల 16న దిల్లీ వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్​ పోస్టులపై కాంగ్రెస్​ పార్టీ అధినాయకత్వంతో ఆయన చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్ గౌడ్​ కూడా దిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యవర్గ కూర్పుపై అధిష్ఠానంతో జరిగే భేటీలో సీఎం చర్చించనున్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించిన విషయం విదితమే. నామినేటెడ్​ పోస్టుల విషయంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.