ETV Bharat / snippets

విజయవాడ - హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు పునరుద్ధరణ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 12:47 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Vijayawada - Hyderabad Train Services : తెలంగాణలో కురిసిన వర్షాలకు పలుచోట్ల రోడ్లు, రైల్వే ట్రాకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసి, మరిన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతోంది. ఈ క్రమంలోనే విజయవాడ - హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులను పునరుద్ధరించారు. మహబూబాబాద్ వద్ద ట్రాక్ మరమ్మతులు పూర్తికావడంతో వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లే రైళ్లను అధికారులు పంపుతున్నారు. ట్రయల్ రన్‌గా విజయవాడ నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను పంపారు. ఈ ఎక్స్​ప్రెస్ గుంటూరు, విజయవాడ, వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.