ETV Bharat / snippets

తల్లిపై అసహనంతో నేలకేసి బాది హత్య చేసిన కుమారుడు

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 12:43 PM IST

Updated : Jul 5, 2024, 3:50 PM IST

Son Killed Mother in Siddipet
Son Killed Mother in Siddipet (ETV Bharat)

Son Killed Mother in Siddipet : దైవదర్శనానికి వచ్చిన తల్లి అస్వస్థతకు గురికావడంతో సేవలు చేయలేక అసహనానికి గురైన కుమారుడు ఆమెను హత్య చేసి అనంతరం సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నించాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్ట క్షేత్ర ఆవరణలోని సత్రంలో జరిగింది.

హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో నివసిస్తున్న బాలకృష్ణమ్మ బుధవారం తన కుమారుడు సర్వేశ్, పక్కింటివారితో కలిసి ఆటోలో నాచగిరి నరసింహస్వామి క్షేత్రానికి వెళ్లి స్వామిని దర్శించుకుని రాత్రి సత్రంలో బసచేశారు. అర్ధరాత్రి తర్వాత బాలకృష్ణమ్మ వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైంది. అసహనంతో కొడుకు తల్లి తలను నేలకేసి బాదటంతో అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం తల్లి అస్వస్థతకు గురై మరణించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలకృష్ణమ్మ కుమార్తె సుజాత అక్కడికి వచ్చిచూసి అనుమానంతో పక్కింటివారికి ఫోన్​చేసి తెలుసుకోగా హత్యచేసిన విషయం వెల్లడైంది. సోదరి ఫిర్యాదుతో పోలీసులు గురువారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jul 5, 2024, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.