Murder in Chodavaram : నేటి కాలంలో సాంకేతికతో పాటు మనుషులూ మారిపోతున్నారు. ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసేవారు. కానీ నేడు మనీ సంబంధాలకు విలువ ఇస్తున్నారు. ఇందుకోసం ఎంతటి దారుణానికైనా వెనకాడటం లేదు. ఎంతలా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రక్త సంబంధీకులనైనా కడతేర్చడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఓ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
Son in Law Murdered his Aunt : చోడవరం మండలం అడ్డూరులో ఆస్తి కోసం అల్లుడు అత్తను హత్య చేశాడు. ఈ క్రమంలోనే అడ్డుకోబోయిన మామపైనా నిందితుడు కత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.