ETV Bharat / snippets

కామారెడ్డిలో రెచ్చిపోయిన దొంగలు - భారీ ఎత్తున బంగారం, వెండి చోరీ

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 12:20 PM IST

Kamareddy Gold Theft Case
Kamareddy Gold Theft Case (ETV Bharat)

Kamareddy Gold Theft Case : ఇళ్లలో దొంగలు పడి 8 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులను చోరీ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో తాళం వేసి ఉన్న 9 ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగలు ప్రవేశించారు. అశోక్​నగర్​ కాలనీ, స్నేహపురీ, విద్యానగర్, కాకతీయనగర్ కాలనీ, శ్రీరామ్​నగర్, వివేకానంద కాలనీల్లో గల 9 ఇంటి తాళాలు పగులగొట్టి 8 తులాల బంగారం, 30 తులాల వెండి వస్తువులు రూ.1.20లక్షల నగదు దుండగులు చోరీ చేశారు. దీంతో బాధితులు స్థానిక కామారెడ్డి పట్టణ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. పట్టణ ప్రజలు విహారయాత్రలు, శుభకార్యాలకు వెళ్లేముందు పోలీస్​స్టేషన్​కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.